బంగాళదుంప సాగు చేసే నేల తయారీ విధానం.. నీటి యాజమాన్య పద్ధతులు..!

కూరగాయలలో ఒకటైన బంగాళాదుంప పంట( Potato Crop ) సాగుకు తక్కువ ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాలు చాలా అనుకూలంగా ఉంటాయి.

మన తెలుగు రాష్ట్రాలలో అక్టోబర్ చివరి నుండి నవంబర్ రెండవ వారం వరకు పంట విత్తుకోవాడనికి చాలా అనువైన సమయం.

ఒకవేళ విత్తుకోవడంలో ఆలస్యం అయితే దుంపలు ఊరే సమయంలో ఉష్ణోగ్రతలు పెరిగితే, నాణ్యమైన దుంపల దిగుబడి పొందలేం.

బంగాళా దుంప కేవలం మూడు నెలల పంట.బంగాళాదుంప పంట సాగుకు నల్ల రేగడి నేలలు, నీరు నిల్వ ఉండే నేలలు తప్ప అన్ని రకాల నేలలు అనుకూలంగానే ఉంటాయి.

దుంప జాతి పంటలు వేసేటప్పుడు నేల తయారీ విధానంలో మెళుకువలు తెలుసుకొని పాటిస్తేనే మంచి దిగుబడి పొందేందుకు అవకాశం ఉంటుంది.

వేసవికాలంలో( Summer ) నేలను లోతు దుక్కులు దున్నుకొని, ఆఖరి దుక్కిలో 10 టన్నుల పశువుల ఎరువుతో( Cattle Manure ) పాటు 40 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసి పొలాన్ని కలియదున్నాలి.

ఆ తరువాత నేల వదులుగా అయ్యేలా దమ్ము చేసుకోవాలి. """/" / నేల వదులుగా మారితే భూమి లోపల దుంప ఊరడానికి చాలా అణువుగా ఉంటుంది.

ఇక పొలంలోని ఇతర పంటలకు సంబంధించిన ఏవైనా అవశేషాలు ఉంటే వాటిని పూర్తిగా తొలగించాలి.

ఇక బంగాళదుంప సాగులో( Potato Cultivation ) విత్తనం విత్తుకునే విషయానికి వస్తే.

తెగులు నిరోధక నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలి.ఒక ఎకరాకు సుమారుగా 650 కిలోల విత్తనాలు అవసరం.

దుంప జాతి పంటలను ఎత్తు బోదెల పద్ధతిలో సాగు చేయాలి.ఇక పొలంలో నీరు నిల్వ ఉండకుండా తాగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇలా చేస్తే పంటకు దుంప కుళ్ళు ఆశించే అవకాశం ఉండదు.ఇక మొక్కలు ఆరోగ్యకరంగా పెరగాలంటే మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరం, బోదెల వరుసల మధ్య 90 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తనాలను విత్తుకోవాలి.

"""/" / బంగాళాదుంప పంటకు నీటి వినియోగం కాస్త తక్కువే.విత్తనం నాటిన తర్వాత ఒక నీటి తడి అందించాలి.

ఆ తర్వాత దుంపలు తయారయ్యే వరకు ప్రతి 10 రోజులకు ఒకసారి నీటి తడి అందించాలి.

దుంపలు ఊడుతున్న సమయంలో ఆరు రోజులకు ఒకసారి నీటి తడి అందించాలి.ఇక దుంపలను నేల నుండి బయటకు తీసే సమయానికి పది రోజుల ముందు నీటి తడులు ఆపేయాలి.

దీంతో నాణ్యమైన బంగాళాదుంప పంట పొందవచ్చు.

వామ్మో, కదులుతున్న రైలుపై డ్యాన్స్ చేసిన యువతి.. చివరికి ఏమైందో చూస్తే..