నిన్నటి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే నేటి ఉపాధి హామీ కూలీలు …!

కరోనా దెబ్బకి ఎంతోమంది నిరాశ్రయులైన సంగతి అందరికీ విదితమే.ముఖ్యంగా వలస కూలీలు వారి జీవనాన్ని కోల్పోతే అనేకమంది వారి ఉపాధిని కోల్పోయారు.

ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో దుకాణాలు, ఆఫీసులు, సాఫ్ట్వేర్ కంపెనీలో అన్ని మూతపడ్డాయి.

ఇక దీంతో చాలామంది ఉద్యోగాలు కోల్పోయి వారి ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇక ఉద్యోగం పోయిన ఇంట్లో ఖాళీగా ఉంటే పని జరగదు కదా.! కాబట్టి దాంతో దొరికిన పని చేసుకుంటారు.

మామూలుగా చదువుకోని వారు, ఊర్లోనే ఉండి జీవనం కొనసాగించే వారు మాత్రమే కూలిపనులు చేసుకుంటూ జీవనం కొనసాగించేవారు ఇంతవరకు.

కానీ ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ మారింది.ఎందుకంటే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే, డిగ్రీ పట్టాలు పొందిన వారు కూడా ఇప్పుడు ఉపాధిహామీ పథకం కోసం కూలి పనులకు రావడమే విచిత్రం.

లాక్ డౌన్ ఇంతకుముందు వేలల్లో లక్షల్లో జీతం పొందినవారు ఇప్పుడు రోజు కూలి కోసం తిప్పలు పడుతున్నారు.

ఇకపోతే బీదర్ జిల్లాలో చాలా మంది యువత ఉపాధి హామీ కొరకు పేరు నమోదు చేసుకుని పనులు చేస్తున్నారు.

అధికారులు మీరు ఇంత చదువుకున్నారు, ఇలాంటి పనులు ఎలా చేస్తారో అని అడిగినా కూడా రోజులు గడవాలంటే ఏదో ఒక పని చేయక తప్పదని వారు పనుల్లోకి వస్తున్నారని అధికారులు తెలియజేస్తున్నారు.

ప్రస్తుతం జిల్లాలో 50 నుంచి 100 మంది విద్యార్థులు ఉద్యోగస్తులు ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్నారని అధికారులు తెలియజేశారు.

ఇక వీరందరికీ ఉపాధి హామీ పథకం కింద కార్డులను జారీ చేసి పనులు చేయించుకుంటూ రోజుకి రెండు వందల డబ్భై ఐదు రూపాయలు సంపాదన గడిస్తున్నారు.

ఇక ఈ విషయంపై యువతను అడగగా లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఖాళీగా ఉండి ఇలాంటి పనులు చేసుకుంటే మనతోపాటు మన ఇంట్లో వారికి కూడా సహాయంగా ఉంటుందని వారు తెలియజేస్తున్నారు.

ఇకపోతే రాష్ట్రం ప్రభుత్వం ఉపాధి హామీ పనులు చేసే ఇంజనీర్లు డిగ్రీ పట్టాలు పొందిన వారి పై ఓ డాక్యుమెంటరీ తీయబోతోంది.

ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు..!