ఆఫీస్ లో పనిచేసే యువతితో సాఫ్ట్ వేర్ ఉద్యోగి అక్రమసంబంధం..! రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య!

హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగస్థుడు తోటి వర్కర్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు, వారి వ్యవహారాన్ని భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టించింది.

వివరల్లోకెళితే నకిరేకల్ కు చెందిన నాగరాజు కి 2007 లో వివాహం జరిగింది, నాగరాజు కి బాధిత మహిళ కు ఒక 8 ఏళ్ల పాప కూడా ఉంది.

నాగరాజు హైదరాబాద్ లోని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ లో టీం మ్యానేజర్ గా పని చేస్తున్నాడు, అదే ఆఫీస్ లో తనతో పాటు పని చేస్తున్న మరొక మహిళ తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు నాగరాజు.

ఆమె తో కలిసి వేరే కాపురం పెట్టాడు.నాగరాజు కుటుంబం మీర్ పేట్ లో ఉంటారు.

కూతురు, భార్య ను మీర్ పేట్ లో వదిలేసి ఇంకో కాపురం పెట్టాడు నాగరాజు.

భర్త వ్యవహారం పైన అనుమాన పడ్డ భార్య, నాగరాజు ఇంకో కాపురం పెట్టాడు అని తెలుసుకుంది.

భర్తను మందలించడానికి ప్రయత్నించినా వినలేదు.కూతురితో సహా నిన్ను కూడా చంపేస్తా అని నాగరాజు బాధితురాలిని బెదిరించాడు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ బంధువులతో కలిసి నాగరాజు బండారాన్ని బయటపెట్టింది భార్య.

పోలీసులకు నాగరాజు పైన ఫిర్యాదు చేసింది.మీర్ పేట్ పోలీసుస్టేషన్ లో నాగరాజు పైన కంప్లైంట్ ఇచ్చింది నాగరాజు భార్య.

తన కూతురికి తనకి తన భర్త అయిన నాగరాజు నుండి ప్రాణహాని ఉందని, అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరింది బాధితురాలు.

సుప్రీంకోర్టు వివాహేతర సంబంధం తప్పు కాదని తీర్పు ఇచ్చిన నాటి నుండి, అధికారికంగానే వివాహేతర సంబంధం పెట్టుకుంటున్నారు చాలా మంది.

అలాంటి కోవలోకే ఈ సంఘటన కూడా చేరుతుంది.8 సంవత్సరాల వయసు గల కూతురుని పెట్టికొని వివాహేతర సంబంధం ఎలా పెట్టికున్నాడో అని సోషల్ మీడియా లో నాగరాజు పైన విపరీతంగా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

రానున్న రోజుల్లో నాగరాజు లాంటి వాళ్ళు మరెంత మంది బయట పడనున్నారో.