పెళ్ళికి తొందరెందుకు అన్నందుకు యువకుడు ఏం చేశాడంటే....!

ప్రస్తుత కాలంలో కొంతమంది ప్రతీ చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకుంటున్నారు.దీనివల్ల తమ అనుకునే వారి జీవితాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నారు.

తాజాగా ఓ యువకుడు పెళ్లి చేయమని తన  తల్లిదండ్రులు అడగగా ఇప్పుడప్పుడే పెళ్ళికి తొందరేముంది కొంతకాలం ఆగు చేస్తామని చెప్పడంతో మనస్థాపానికి గురైనటువంటి యువకుడు ఆత్మహత్య చేసుకొని ఆ తల్లిదండ్రుల జీవితంలో తీవ్ర విషాదాన్ని నింపాడు.

ఈ ఘటన తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే నిఖిల్ అనే యువకుడు హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ ప్రాంతంలో తన తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్నాడు.

నిఖిల్ స్థానికంగా ఉన్నటువంటి సాఫ్ట్ వేర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు.తాజాగా నిఖిల్ తన తల్లిదండ్రులను తనకు పెళ్లి చేయాలని అడిగాడు.

దీంతో యువకుడు తల్లిదండ్రులు ఇప్పుడే నీకు పెళ్లి ఎందుకు మరో రెండు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాలు ఆగిన తర్వాత చేస్తామని చెప్పారు.

దీంతో యువకుడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకున్నాడు.

"""/"/ అయితే పని ముగించుకొని ఇంటికి వచ్చినటువంటి యువకుడు తల్లిదండ్రులు అతడిని దగ్గరలో ఉన్నటువంటి ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయి యువకుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సమాచారం అందుకున్న అటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.అలాగే యువకుడి తల్లిదండ్రులు తెలిపిన టువంటి వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

స్టిక్కర్స్ అమ్ముతూ నెలకు 16 లక్షలు సంపాదిస్తున్న బ్రిటిష్ యువకుడు..?