గూగుల్ సహాయంతో ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి...
TeluguStop.com
సాప్ట్ వేర్ రంగంలో పని చేస్తున్నటువంటి ఓ ఉద్యోగి ఒంటరితనం, పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం పట్టణానికి చెందినటువంటి మౌళీధర్ అనే వ్యక్తి హైదరాబాద్ నగరంలోని ఓ ప్రముఖ సంస్థలో సాప్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
అయితే ఇతడికి తల్లిదండ్రులు ఎవరూ లేరు.కాగా అతడికి ఒక చెల్లెలు ఉండగా ఆమె హాస్టల్లో ఉండి తను కూడా ఉద్యోగం చేస్తోంది.
అయితే మౌళీధర్ ఎప్పుడు ఒంటరి తనం తో బాధపడుతూ ఉండేవాడు.అంతేగాక ఇతడికి పలు ఆర్థిక పరమైన సమస్యలు కూడా ఉన్నాయి.
దీంతో అప్పుల వాళ్ళ నుంచి కూడా కొంతమేర ఒత్తిడి ఎదురవడంతో ఏమి చేయాలో, ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో సులభంగా ఆత్మహత్య చేసుకోవడం ఎలా అని గూగుల్ లో వెతికాడు.
ఇందులో భాగంగా నోటిలో గ్యాస్ సిలిండర్ పైపు పెట్టుకొని ఊపిరాడకుండా ముఖానికి నల్లటి కవర్ కప్పుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
"""/"/
అనంతరం అతడి బంధువులు ఫోన్ చేయగా మౌళీధర్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో సమీప బంధువులైన అటువంటి ఓ వ్యక్తి వెళ్లి చూడగా తన రూములో విగతజీవిగా మౌళి ధర్ కనిపించాడు.
దాంతో అతను వెంటనే పోలీసులకు, అతడి చెల్లెలు శ్రావణికి సమాచారం అందించాడు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అలాగే మృతుడి సోదరి శ్రావణి తెలిపినటువంటి వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ముఖ చర్మాన్ని తెల్లగా మెరిపించే ఎఫెక్టివ్ సీరం ఇది.. ఇంట్లోనే తయారు చేసుకోండిలా!