సిద్దు ఏడుపు ఆపి మంచి సినిమాలు చేయాలంటూ విమర్శలు!
TeluguStop.com
బొమ్మరిల్లు హీరో సిద్దార్థ్ ( Siddharth )తన తాజా చిత్రం చిన్నా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మీడియా ముందు మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశాడు.
చిత్తా( Chitta ) టైటిల్ తో తమిళ్ లో ఒక సినిమా ను హీరోగా నటించి స్వయంగా నిర్మించాడు.
ఆ సినిమా ను తమిళ్ తో పాటు తెలుగు, హిందీ, కన్నడం మరియు మలయాళం లో కూడా విడుదల చేయబోతున్నారు.
తెలుగు లో చిన్నా అనే టైటిల్ తో సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
"""/" / సిద్దు తన చిన్నా సినిమా తో ఈ వారంలో రాబోతున్నాడు.
ఇదే వారం లో ఏకంగా ఆరు సినిమా లు రాబోతున్నాయి.మొత్తం ఆరు సినిమా లు ఒకే రోజు వస్తున్నాయి అంటే కచ్చితంగా థియేటర్ల సమస్య అనేది ఉంటుంది.
ఒక్క సినిమా కే కాకుండా దాదాపు అన్ని సినిమాలకి కూడా థియేటర్ల సమస్య ఉంటుంది.
ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా సిద్దార్థ్ మీడియా ముందుకు వచ్చి తెలుగు వారు నాకు అన్యాయం చేస్తున్నారు అంటూ మొత్తం తెలుగు సినిమా పరిశ్రమ పై విమర్శలు చేయడం ఏమాత్రం సబబు కాదు.
"""/" /
సిద్దు గత చిత్రాలు టక్కర్ ( Takkar )మరియు మహా సముద్రం సినిమా లు విఫలం అయ్యాయి.
అందుకే ఇప్పుడు థియేటర్ల సమస్య వచ్చింది.మంచి ఫామ్ లో ఉంటే సిద్దు సినిమాలను పోటీ పడి విడుదల చేసేందుకు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వచ్చే వారు.
మంచి సినిమా లు తీసి ప్రేక్షకులను అలరించడం మానేసి థియేటర్లు దక్కడం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకోవడం ఏంటి అంటూ సిద్ధు ( Siddharth )పై కొందరు విమర్శలు చేస్తున్నారు.
చిన్నా సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే రెండవ రోజే థియేటర్ల సంఖ్య రెట్టింపు చేసేందుకు బయ్యర్లు పోటీ పడుతారు.
ఆ విషయం ను గుర్తించకుండా సిద్ధు అనవసర మాటలు మాట్లాడుతున్నాడు అంటూ కొందరు విమర్శిస్తున్నారు.
చుండ్రుతో దిగులెందుకు.. పుదీనా ఉందిగా అండగా..!