బన్నీకి అవార్డుపై విమర్శలు… బుద్దిలేని గొర్రెల మందకు ఆ విషయం తెలియదా?

అల్లు అర్జున్‌( Allu Arjun ) పుష్ప లో అద్భుతమైన నటన కనబర్చినందుకు గాను జాతీయ స్థాయి ఉత్తమ నటుడు అవార్డును సొంతం చేసుకోవడం జరిగింది.

అల్లు అర్జున్ కు ఈ అవార్డు రావడం పట్ల అభిమానులు చాలా సంతోషంగా ఉంటే, కొందరు మాత్రం కోడి గుడ్డు పై ఈకలు పీకినట్లుగా విమర్శలు గుప్పిస్తున్నారను.

ఇలాంటి వారు ప్రతి చోట ఉంటారు.ఇప్పుడు తమిళ మీడియా వర్గాల్లో కొందరు మరియు హిందీ మీడియాకు చెందిన కొందరు పుష్ప( Pushpa ) సినిమా లో అల్లు అర్జున్‌ ఒక స్మగ్లర్‌ గా కనిపించాడు.

"""/" / స్మగ్లర్ గా నటించిన వ్యక్తికి జాతీయ అవార్డు( National Film Award ) ఇవ్వడం ఎలాంటి మెసేజ్ ఇవ్వడం అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఆ గొర్రెల మందకు బుద్ది లేని వారికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు కొందరు ఘాటుగానే సమాధానం ఇస్తున్నారు.

జాతీయ స్థాయి ఉత్తన నటుడు అవార్డు అనేది సినిమాలో అతడు పోషించిన పాత్రకు కాదు, ఆ సినిమా లోని కథ కు కాదు.

సినిమా లోని అతడి నటనకు అనేది తెలియకుండానే విమర్శలు చేస్తున్నారు అంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అల్లు అర్జున్ కు అవార్డు రావడం ఇష్టం లేని వారు మాత్రమే ఇలా విమర్శలు చేస్తున్నారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

"""/" / అల్లు అర్జున్‌ స్మగ్లర్ గా మాత్రమే నటించాడు.అతడు నిజంగా స్మగ్లర్ అన్నట్లుగా, అలాంటి వ్యక్తికి ఎలా అవార్డు ఇస్తారు అన్నట్లుగా ప్రశ్నించడం సిగ్గు చేటు అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ కామెంట్స్ పై పుష్ప మేకర్స్ ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.అల్లు అర్జున్ జాతీయ అవార్డు కి పూర్తి అర్హుడు.

ఎవరు ఏమన్నా కూడా జాతీయ అవార్డు అందుకోబోతున్న బన్నీ కష్టం కు పూర్తి ఫలితం దక్కిందని కొందరు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సందీప్ కిషన్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న నాగార్జున హీరోయిన్…