నాన్న ప్లీజ్ కమ్‌.. వారసత్వం వద్దన్న అఖిల్‌ మళ్లీ అదే పని!

అక్కినేని ప్రిన్స్ అఖిల్( Akhil ) ఇటీవల ఏజెంట్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు అక్కినేని లెగసీని భుజాలపై మోయడం అస్సలు ఇష్టం లేదు అన్నట్లుగా పేర్కొన్నాడు.

తాను అక్కినేని వారసుడిగా కాకుండా ఒక నటుడిగా, బ్యాక్ గ్రౌండ్ లేని వ్యక్తిగా ఇండస్ట్రీలో కొనసాగాలని కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు.

అక్కినేని వారసుడిగా అన్ని తరహా సినిమాలను చేయలేక పోతున్నాను.అందుకే ఆ వారసత్వం అనేది వద్దు అనుకున్నట్లుగా అఖిల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయాని తెలిసిందే.

వారసత్వం వద్దు అనుకున్న అఖిల్ 24 గంటలు కూడా తిరగక ముందే తన ఏజెంట్ సినిమా( Agent Movie ) యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి నాన్నని ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది.

ప్రభాస్ లేదా మరో హీరో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉంది అంటూ వార్తలు వచ్చాయి.

కానీ వారు బిజీగా ఉండడం వల్ల చివరకు అఖిల్ తన తండ్రిని ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆహ్వానించాడని.

నాగార్జున( Nagarjuna ) కూడా వచ్చేందుకు ఓకే చెప్పాడని తెలుస్తోంది. """/" / నేడు వరంగల్ లో భారీ ఎత్తున జరగబోతున్న ఏజెంట్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో అఖిల్ మరియు నాగార్జున సందడి చేయబోతున్నారు.

అఖిల్ కి వారసత్వంపై.అక్కినేని పేరు ఆసక్తి లేకుంటే ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి నాగార్జున ని ఆహ్వానించకుండా ఉండాల్సింది అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆ విషయంలో అఖిల్ ఏమంటాడు అనేది చూడాల్సి ఉంది.ఇక ఏజెంట్ సినిమా విషయానికి వస్తే సురేందర్ రెడ్డి( Surender Reddy ) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అఖిల్ చాలా కొత్తగా కనిపించబోతున్నాడు.

దాదాపుగా 80 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా ను నిర్మించారు.ఇన్నాళ్లు నాగార్జున ఈ సినిమా గురించి పట్టించుకోక పోవడంతో ఏం జరిగింది అనే చర్చ మొదలైంది.

ఎట్టకేలకు ఆయన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యేందుకు ఓకే చెప్పడంతో ఏజెంట్ విషయంలో నాగార్జున నమ్మకం గానే ఉన్నాడని టాక్‌ వినిపిస్తుంది.

ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఏజెంట్ సినిమాతో అఖిల్ భారీ కమర్షియల్ సక్సెస్ ని సొంతం చేసుకుంటాడా అనేది చూడాలంటే చూడాల్సిందే చూడాలి.

విక్రమ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్న స్టార్ డైరెక్టర్…