పొగాకు ఉత్పత్తుల ప్రచారం.. మహేష్ బాబుపై నెటిజన్ల ఆగ్రహం..
TeluguStop.com
ఈ దేశంలో సినిమా హీరోలను, క్రికెటర్లను అభిమానించినట్లు మరెవరినీ అభిమానించరు.ఆ అభిమానాన్ని ఆయా తారలు మిస్ యూజ్ చేస్తున్నారు.
అందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి.రకరకాల బ్రాండ్ల పేరుతో ప్రచారం చేస్తూ మోసం చేస్తున్నారు.
తాజాగా ఓ ఫేస్ క్రీం యాడ్ లో నటించాలని టాలీవుడ్ టాప్ హీరోయిన్ సాయి పల్లవిని సంప్రదించారు ఓ కార్పొరేట్ కంపెనీ.
ఈ ఆఫర్ ను తను సున్నితంగా తిరస్కరించింది.ఫేస్ క్రీమ్ మనుషుల రంగును మార్చేది కాదని.
తను బలంగా నమ్మించింది.తన అబద్దపు ప్రచారంతో జనాలను మోసం చేయకూడదని భావించింది.
అందుకే తను ఈ యాడ్ చేసేందుకు నో చెప్పింది.కానీ తాజాగా టాలీవుడ్ టాప్ హీరోయిన మహేష్ బాబు ఓ చెత్త యాడ్ చేసి సర్వత్రా విమర్శలు ఎదురొంటున్నాడు.
పాన్ బహర్ మౌత్ ప్రెషనర్ పేరుతో ఓ యాడ్ లో పాల్గొన్నాడు.ఎంతో పాపులారిటీ ఉన్న మహేష్ బాబు ఈ యాడ్ చేయడం ఏంటని ప్రశ్నలు వర్షం కురుస్తుంది.
డబ్బు కోసం జనాల అరోగ్యంతో చెలగాటం ఆడే యాడ్ ను ప్రమోట్ చేయడం ఏంటని విమర్శిస్తున్నారు.
దేశంలో పొగాకు ఉత్పత్తుల మీద నిషేధం ఉంది.వీటి మూలంగా రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయని.
ప్రభుత్వం వీటిపై నిషేధం విధించింది.అయినా ఆయా కంపెనీలు వేరే ఉత్పత్తుల పేరుతో మద్యం, పొగాకు, ఉత్పత్తుల గురించి ప్రచారం చేసుకుంటున్నాయి.
"""/"/
ప్రస్తుతం మహేష్ బాబు ఈ యాడ్ లో నటించడం హాట్ టాపిక్ గా మారింది.
తెలుగులో డీసెంట్ హీరోగా గుర్తింపు ఉన్న మహేష్ బాబు.సాధారణంగా ఎలాంటి వివాదాల జోలికి పోడు.
రాజకీయాల గురించి మాట్లాడడు.తన పని ఏంటో తాను చూసుకుంటాడు.
అయితే గతంలో తను చేసిన థమ్స్ అప్ యాడ్ పైన కూడా విమర్శలు వచ్చాయి.
జనాల అనారోగ్యానికి కారణం అయ్యే కూల్ డ్రింక్ గురించి ఎలా ప్రమోట్ చేస్తాడు? అని పలువురు ప్రశ్నించారు.
ప్రస్తుతం పాన్ బహర్ యాడ్ లో నటించడంతో మరిన్ని విమర్శలకు కారణం అవుతున్నాడు.
వార్2 సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రోల్ ఇదే.. పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నారా?