ప్రాంక్ ఆడాడు.. వీపు పగిలింది!
TeluguStop.com
ప్రతి సందర్భం మనకు అనుకూలంగా ఉండదుకొన్ని సందర్భాలు మనకు వ్యతిరేకంగా ఉంటాయి అలాంటి దారుణమైన సందర్భమే ఓ వ్యక్తికి ఎదురైంది ఇంకేముంది వీపు పగిలేలా కొట్టింది ఓ యువతీ.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ఓ వ్యక్తి ఓ యువతిని సరదాగా ఒక ఆట ఆడుదామని పిలిచాడు.
అతను చెప్పినదానికి ఆమె కూడా సరేనంది.అయితే ఆట ఏంటి అంటే? యువకుడు బాల్స్ తీసి యువతి వైపు విసిరేస్తాడు.
ఆమె వాటిని తలతో నెట్టుతూ కింద గ్లాస్‌లో పడేలా వెయ్యాలి.అలా ఆట మొదలైంది
దీంతో అతడు జేబులో ఉండే ఒక్కో బంతిని ఆమె తలపై వేశాడు అలా మూడు బంతులు వేశాడు కానీ ఆమె ఏ ఒక్కటీ గ్లాసులో పడేయలేకపోయింది.
ఇంకా ఆమెపై బాల్ వేస్తే సరిగ్గా గ్లాస్ లో పడేలా తలా వంచింది ఇంకా అదే సమయంగా భావించిన ఆ యువకుడు ఆమె తలపై బంతి కాకుండా కోడి గుడ్డు విసిరాడు దీంతో ఆమె తలపైనే ఆ గుడ్డు పగిలింది ఆ యువతీకి దారుణమైన కోపం వచ్చింది.
ఇంకేముంది ఆమె పక్కనే ఉన్న టేబుల్ పై ఉండే వస్తువులతో దాడి చేసింది వీపు విమానం మోత మోగించింది.
ఇది అంత వీడియో తీశారు.ఇంకా ఈ వీడియోను క్వారంటైన్ లైఫ్ అంటూ భారత వ్యాపారవేత్త హర్ష గొయాంక శనివారం సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ సింపుల్ చిట్కా పాటిస్తే మీ ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు!