హుజురాబాద్ ఉప ఎన్నికలో కీలకంగా మారిన సోషల్ మీడియా

రాజకీయాలలో మీడియా పాత్ర కీలకం అన్న విషయం అందరూ మూకుమ్మడిగా అంగీకరించాల్సిన విషయమే.

ఎంతలా మీడియా కీలక పాత్ర పోషిస్తుందంటే మీడియా తలచుకుంటే ఏకంగా ప్రభుత్వాలే మారిపోతాయి అన్నంతలా మీడియా ప్రభావితం చేయగలదు.

అందుకే ప్రతి ఒక్కరు మీడియాకు తగిన గౌరవాన్ని ఇస్తుంటారు.ఇక అసలు విషయంలోకి వస్తే ఒకప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా మాత్రమే ఉండేది.

కావున సాధ్యమైనంతవరకు ప్రతి ఒక్కరు ప్రజల్లోకి వెళ్లాలంటే ఇక తప్పని సరిగా మీడియా సహాయం తీసుకునే వారు.

రకరకాల యాడ్ ల ద్వారా ప్రజల్లోకి వెళ్ళేలా కార్యాచరణను రూపొందించుకునే వారు.కానీ రాను రాను ఎలక్ట్రానిక్ మీడియా ప్రభావం తగ్గుతూ వచ్చింది.

దానికి ప్రధాన కారణం సోషల్ మీడియా.ఒకప్పుడు మీడియాలో పార్టీకి కవరేజ్ ఇవ్వాలన్నా, ప్రజల్లోకి వెళ్లాలన్నా చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి.

కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక తమ కంటూ ఒక సోషల్ మీడియా పేజీని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని, అభిమానఊల పేజీలు ఇంకా అదనం ఇలా ఎలక్ట్రానిక్ మీడియాపై ఆధార పడకుండా అంతేకాక తమ ప్రత్యర్థి పార్టీలపై కూడా సోషల్ మీడియా వేదికగా మాటల తూటాలు పేలుచుకుంటూ ఇటు సోషల్ మీడియాలోనూ పార్టీల మధ్య పొలిటికల్ ఫైట్ జరుగుతున్న పరిస్థితి ఉంది.

ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నిక త్వరలో జరగనున్న సంగతి తెలిసిందే.దీంతో ఇప్పుడు ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు ప్రజల్లోకి క్షేత్ర స్థాయి వరకు వెళ్ళే విషయంలో సోషల్ మీడియా కీలకపాత్ర పోషిస్తున్న పరిస్థితి ఉంది.

బీజేపీ తమ సోషల్ మీడియా పేజీలో టీఆర్ఎస్ పై విమర్శలు చేయడం, టీఆర్ఎస్ సోషల్ మీడియా పేజీలో బీజేపీపై విమర్శలు చేయడం ఇలా పొలిటికల్ వార్ ను క్రియేట్ చేయడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తున్నదనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఓటుకు నోటు కేసుపై సుప్రీంలో విచారణ వాయిదా