ఫేస్ బుక్ వినియోగదారులకు శుభవార్త… అదిరిపోయే కొత్త ఫీచర్…!

ప్రస్తుత యుగం.సోషల్ మీడియా యుగం.

ఒకసారి ఈ సోషల్ మీడియాకు అట్రాక్ట్ అయ్యారు అంటే చచ్చే వరకు ఈ సోషల్ మీడియా నుండి బయటకు రాలేరు.

ఇంకా ఫేస్ బుక్ లో అయితే.పోస్టులు, న్యూస్ ఫీడ్, వీడియోలు ఇలా అన్నీ చూసుకుంటూ ఉండేసరికి సమయం అంత వృథా అయిపోతుంది.

ఇంకా అలాంటి ఫేస్ బుక్ కు.సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి అని అనుకున్నా సరే ఉండలేరు.

అందుకే ఫేస్ బుక్ ఇప్పుడు కొత్త ఫీచర్ తీసుకువస్తోంది.దీని పేరు క్వైట్ మోడ్.

ఫేస్ బుక్ లో వినియోగదారులు గడిపే కాలాన్ని ఈ ఫీచర్ తో నియంత్రణ చెయ్యచ్చు.

దీన్ని ఫేస్ బుక్ యాప్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు.ఇంకా ఈ క్వైట్ మోడ్ ఎలా అని చేస్తుంది అంటే? ఓ గంట పాటు ఫేస్ బుక్ చూడకూడదని టైమ్ సెట్ చేసి క్వైట్ మోడ్ ను ఆన్ చేస్తే, ఆ గంట పాటు ఫేస్ బుక్ ను చూడలేరు, ఫేస్ బుక్ పోస్టులకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్స్ రావు.

మీరు సెట్ చేసిన టైమ్ పూర్తయే వరుకు ఫేస్ బుక్ చూడడం కుదరదు అంటూ క్వైట్ మోడ్ హెచ్చరిస్తుంది.

ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రస్తుతం ఐఫోన్ వినియోగదారులకు ఉండగా.ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్ మే నెలలో అందుబాటులోకి రానుంది.

ఏమైతేనేం సోషల్ మీడియాలో గడిపే సమయాన్ని తగ్గించుకోవాలనుకునే వారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.

సినిమా కోసం రెండేళ్లు తిరిగా.. భార్య జీతంతో బ్రతికా.. దిబాకర్ బెనర్జీ కామెంట్స్ వైరల్!