చైసామ్ విడాకులు.. బుద్దిలేని వారు చాలా మంది ఉన్నారే!
TeluguStop.com
టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ నాగ చైతన్య మరియు సమంతలు విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు.
తాము కలిసి ఉండటం సాధ్యం కాదు.విడిపోతున్నాం అంటూ వారు చేసిన ప్రకటన అభిమానుల గుండెలను బద్దలు కొట్టినంత పని చేసింది.
అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అంతా కూడా వారు కలిసి ఉంటే బాగుండేది అంటున్నారు.
అభిమానులు వారి నిర్ణయాన్ని సమర్ధిస్తున్నట్లుగా చెబుతున్నారు.ఇష్టం లేదు కాని వారి వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే అర్హత వారికి ఉంది.
అందుకే ఈ విషయంలో నేను ఏమీ మాట్లాడాలని అనుకోవడం లేదు అంటూ కొందరు అభిమానులు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నట్లుగా పీకుతూనే ఉన్నారు.
"""/"/
అభిమానులం అని చెప్పుకుంటున్న కొందరు ఈ విషయంలో పదే పదే సమంతను తప్పు చేసినట్లుగా జనాలను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు.
స్వయంగా నాగార్జున ఇద్దరి మద్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించాడు.అయినా కూడా ఇద్దరు విడిపోవాలని బలంగా కోరుకున్నారు.
కనుక ఇక చేసేది లేక ఓకే చెప్పారు.ఇలాంటి సమయంలో కొందరు సమంత మొండి తనం మరియు ఆమె వ్యవహార శైలి వల్లే విడి పోయారు అంటూ విమర్శలు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో కొందరు కొన్ని ప్రచారాలు చేస్తున్నారు.ముఖ్యంగా కొందరు ఆమె అబార్షన్ చేయించుకుందని.
ఆ డాక్టర్ చెప్పుడు మాటలు విని సమంత ఇలా చేసింది అంటూ కొందరు చెబుతున్నారు.
ఇక కొందరు ఒక ఫ్యాషన్ డిజైనర్ మాట వినడం వల్ల సమంత జీవితం నాశనం అయ్యిందని అంటుంటే కొందరు మాత్రం లేడీ డైరెక్టర్ వల్ల సమంత వైవాహిక జీవితం బ్రేక్ పడిందని అంటున్నారు.
మొత్తానికి బుద్దిలేని వారు చాలా మంది సమంతను విమర్శిస్తున్నారు.ఇద్దరి వ్యక్తిగత విషయం గురించి మాట్లాడే వారు బుద్ది లేని వారు.
అంటే సోషల్ మీడియాలో బుద్దిలేని వారు చాలా మందే ఉన్నారు.
వీడియో: నెటిజన్లను నవ్విస్తున్న ఎలాన్ మస్క్ రోబో.. తడబడుతూనే నడక నేర్చుకుంటోందిగా..?