కల్కి Vs యానిమల్: కొత్త వివాదానికి తెరలేపిన నెటిజన్లు..

ఇంటర్‌నెట్ యూజర్లు నిత్యం ఏదో ఒక వివాదం నడుస్తూ ఉండాలని కోరుకుంటారు.ఏ కాంట్రవర్సీ లేకపోతే వాళ్లే సొంతంగా క్రియేట్ చేస్తారు.

ఇప్పుడు కల్కి సినిమా( Kalki Movie ) విషయంలోనూ ఓ కాంట్రవర్సీకి తెర లేపారు.

నాగ్ అశ్విన్( Nag Ashwin ) కల్కి సినిమాను రూ.600 కోట్ల బడ్జెట్‌తో తీశాడు.

ఈ మూవీ ఫ్లాప్ అయితే భారీ నష్టాలు వచ్చేవి.అదృష్టం కొద్దీ ఫస్ట్ నుంచి ఆ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటూ ఇప్పుడు రూ.

1,000 కోట్ల క్లబ్‌లో చేరింది.దాంతో ఈ సినిమా తీసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇన్‌స్టాలో ఓ పోస్టు షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు.

కల్కి-2 సినిమాపై హైప్‌ కూడా పెంచాడు.ఇదే పోస్టులో "1000 కోట్ల వసూళ్ల కోసం తామేమీ విపరీతమైన వైలెన్స్, బోల్డ్ సీన్లు పెట్టలేద"ని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు.

"""/" / ఇక అప్పటినుంచి ఈ దర్శకుడిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు.

యానిమల్( Animal Movie ) దర్శకుడు వంగా సందీప్‌రెడ్డిని( Sandeep Reddy Vanga ) ఉద్దేశించే నాగ్‌ అశ్విన్ ఇలా పోస్ట్ చేశాడని సోషల్ మీడియా యూజర్లు నెగెటివ్ ప్రచారం మొదలుపెట్టారు.

ఈ సంగతి తెలుసుకున్న నాగ్ అశ్విన్ వెంటనే తన పోస్టు రిమూవ్ చేసి సైలెంట్ అయిపోయాడు.

కానీ నెటిజన్లు మాత్రం దీన్ని పెద్ద కాంట్రవర్సీగా మార్చారు.వంగా సందీప్‌రెడ్డినే ఇలా టార్గెట్ చేస్తావా? తోటి దర్శకులతో ఇలానేనా ప్రవర్తించేది అంటూ బాగా విమర్శిస్తున్నారు.

తక్కువ బడ్జెట్‌తోనే దాదాపు రూ.1000 కోట్ల వసూళ్లు చేయడం సందీప్ కి మాత్రమే సాధ్యమైందని, అది చూసి ఓర్వలేక ఇలా మాట్లాడుతున్నావా అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు.

"""/" / వాస్తవాలు మాట్లాడుకుంటే, యానిమల్ సినిమాలో హింస, అడల్ట్ సీన్లు బాగా ఉన్నాయి.

అందువల్ల సినిమా సెలబ్రిటీలతో పాటు ప్రేక్షకులు కూడా సందీప్ ని విమర్శించారు.కానీ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

ప్రస్తుతం నాగ్ అశ్విన్‌కు కొందరు సపోర్ట్ చేస్తున్నారు.మరి కొంతమంది మాత్రం యానిమల్, కల్కి సినిమాలను కంపేర్ చేస్తున్నారు.

నాగ్ అశ్విన్ పోస్ట్ ఒక జనరల్, జెన్యూన్ ఫీలింగ్ ఎక్స్‌ప్రెస్ చేసినట్లు ఉందే తప్ప వంగా సందీప్‌రెడ్డిని టార్గెట్ చేసినట్టుగా ఏ కోణంలోనూ కనిపించలేదు.

యానిమల్ సినిమాను టార్గెట్ చేయాల్సిన అవసరం అవసరమూ అతనికే అసలే లేదు.ఇప్పటిదాకా నాగ్ అశ్విన్ ఎలాంటి కాంట్రవర్షల్ కామెంట్స్ చేయలేదు.

"""/" / వంగా సందీప్‌రెడ్డితో అతనికి మనస్పర్ధలు ఏవీ లేవు.వాళ్ళందరూ బాగానే ఉన్నారు కానీ నెటిజన్లు కావాలనే వారి మధ్య చిచ్చు పెట్టే లాగా చర్చలకు దారి తీస్తున్నారు.

ఇకపోతే కల్కి- 2 సినిమా( Kalki 2 ) త్వరలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

మరోవైపు వంగా సందీప్‌రెడ్డి "స్పిరిట్"( Spirit Movie ) కూడా భారీ బడ్జెట్ తో వస్తోంది.

రెండు సినిమాల్లోనూ ప్రభాస్‌యే హీరో, సేమ్ రేంజ్ మూవీస్.ఈ సమయంలో ఒకరికొకరు కొట్టుకుంటే చివరికి నష్టపోయేది ప్రభాస్( Prabhas ) అభిమానులే చెప్పుకోవచ్చు.

ఈ కాంట్రవర్సీని సందీప్ ఇంకా ముందుకు తీసుకుపోలేదు కాబట్టి ప్రస్తుతానికైతే ఈ నష్టం తక్కువే అని చెప్పుకోవచ్చు.

వైసీపీ సీనియర్ల చూపు ఆ పార్టీ పై పడిందా ?