ఎవరు నిజం…ఏది వాస్తవం…వ్యవస్థ పయనమెటు: నారగోని ఆవేదన
TeluguStop.com

నల్లగొండ జిల్లా: వర్తమాన రాజకీయ,పాలనా వ్యవహారాలపై సామాజిక కార్యకర్త నారగోని ప్రవీణ్ కుమార్ సంధించిన ప్రశ్నావళి ప్రజలను ఆలోచింప చేస్తుంది.


తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా జరుగుతున్న నేటి తాజా పరిస్థితులు అతని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.


ఇంతకీ నారగోని మాటల్లో ఎవరు నిజం.ఏదీ వాస్తవం.
? అనేది నేటి సమాజం, ముఖ్యంగా యువతరం సీరియస్ గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.
లేకుంటే ఈ సమాజం మరింత వెనకకు వెళ్లి,మరో ఫ్యూడల్ వ్యవస్థకు దారి తీసే ప్రమాదం లేకపోలేదు.
నారగోని ప్రశ్నలు.దోపిడీ దొంగలైన రాజకీయ నాయకులను పొగుడుతూ రాసేవాడు జర్నలిస్టా.
?దోపిడీ పాలనను పొగుడుతూ పాట రాసేవాడు రచయితా.?సకల జనులను సమానంగా చూడని నాయకుని గురించి పొగుడుతూ పాడే వాడు కళాకారుడా ప్రజా గాయకుడా.
?పాలకుడు చెప్పే పచ్చి అబద్ధాలకు కూడా చప్పట్లు కొట్టే వాడు బానిస కాడా.
?
అధికారులు ప్రజలకు సేవ చేయాలా.? రాజకీయ నాయకులకా.
? అధికారి ఉద్యోగంలో ఉండి రాజకీయ నాయకుడి కాళ్ళు మొక్కే నీచమైన సంస్కృతి ఎందుకు.
? సామాన్యుడు అధికారులను కలవడానికి గంటలు,రోజుల తరబడి నిరీక్షించాలి.! రాజకీయ నాయకుడు ఎప్పుడు వచ్చినా అతని సేవలో తరించడం ఏమిటి.
? రాజ్యాంగం,చదువు అదే నేర్పిందా.? జర్నలిస్టు రచయిత,కళాకారుడు, ప్రజల వైపు ఉండాలా.
? పాలకుని వైపు ఉండాలా.?రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ లేడు.
!సమాచార హక్కు కమిషన్ లేదు,సమా చారం ఇవ్వరు.!మానవ హక్కుల కమిషన్ పని చేయడం లేదు.
!మరి దేని కోసం మనకు ప్రభుత్వం.??? ఎవరిని అడగాలి ప్రజలు.
అమెరికన్ స్పేస్ కంపెనీనికి సారథిగా భారతీయుడు.. ఎవరీ తేజ్‌పాల్ భాటియా?