శోభితతో చైతన్య నిశ్చితార్థం… సమంత విషయంలో నాగచైతన్యదే తప్పా…నెటిజన్స్ రియాక్షన్ ఇదే?
TeluguStop.com
అక్కినేని వారసుడు నాగచైతన్య( Nagachaitanya ) మరోసారి కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే.
ఈయన గతంలో సమంతను ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న వీరి వైవాహిక జీవితం ఎక్కువ కాలం పాటు నిలబడలేదని చెప్పాలి.
పెళ్లయిన మూడేళ్లకు సమంత( Samantha ) నుంచి విడాకులు( Divorce ) తీసుకొని విడిపోయిన నాగచైతన్య త్వరలోనే మరొక నటితో కలిసి కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు.
గత కొంతకాలంగా ఈయన నటి శోభిత( Sobhitha ) తో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చినప్పటికీ ఈ వార్తల గురించి ఎక్కడ స్పందించలేదు.
"""/" /
ఇకపోతే తాజాగా ఈ జంట కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం( Engagement ) జరుపుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మరోసారి సమంత నాగచైతన్య విడాకుల విషయం తెరపైకి వచ్చింది.
గతంలో సమంతదే తప్పు అంటూ వీరి విడాకుల గురించి ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి.
సమంతకు ఇతరులతో రిలేషన్ ఉన్న నేపథ్యంలోనే నాగచైతన్య తనకు విడాకులు ఇచ్చారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి.
"""/" /
తాజాగా నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధమయ్యి నిశ్చితార్థం కూడా చేసుకోవడంతో నాగచైతన్య సమంత విడాకుల విషయంలో తప్పు సమంతది ఏ మాత్రం లేదని ఆమె ఇప్పటికీ నాగచైతన్యను వదులుకున్నందుకు బాధపడుతుందని ఆమె సన్నిహితులు వెల్లడించారు.
ఇలా నాగచైతన్య జ్ఞాపకాలతోనే సమంత బ్రతుకుతోందని, నాగచైతన్య మాత్రం సమంత జ్ఞాపకాలను చెరిపేస్తూ శోభితతో కొత్త జీవితం ప్రారంభానికి శ్రీకారం చుట్టడంతో సమంత విషయంలో నాగచైతన్య తప్పు అంటూ నేటిజన్స్ పెద్ద ఎత్తున వీరి నిశ్చితార్థపు ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు.
ఇక శోభిత నాగచైతన్య ఫోటోలు వైరల్ గా మారడంతో శోభిత కంటే సమంతనే నాగ చైతన్యకు జోడిగా బాగుంటుంది అంటూ పలువురు ఈ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు.
ట్రంప్‌కు సిలికాన్ వ్యాలీ సపోర్ట్.. వాళ్లతో కలిసి పనిచేస్తా : భారత సంతతి క్యాపిటలిస్ట్