నాలో ఖాళీని శోభిత పూర్తి చేస్తుంది.. నాగచైతన్య కామెంట్స్ వింటే మాత్రం ఫిదా అవ్వాల్సిందే!

టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్య( Naga Chaitanya ) హీరోయిన్ సమంతకు( Samantha ) విడాకులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు రెండో పెళ్ళికి సిద్ధమైన విషయం తెలిసిందే.

టాలీవుడ్ హీరోయిన్ శోభిత ధూళిపాలను( Sobhita Dhulipala ) డిసెంబర్ 4వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నారు.

ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన వార్తలే సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు నాగచైతన్య శోభితతో వివాహం పట్ల ప్రేమ పట్ల చేయలేదు అన్న విషయం మనందరికీ తెలిసిందే.

"""/" / కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో శోభిత ధూళిపాల గురించి అలాగే తన ప్రేమ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నాగచైతన్య.

ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ.డిసెంబర్ 4 న తమ వివాహం జరగనుంది, ఈ వివాహ వేడుక మాకు సెంటిమెంట్.

రెండు కుటుంబాల వారు పెళ్లి కోసం చాలా ఎగ్జైట్ అవుతున్నాము.పెళ్లి వేడుకలు నిర్వహించేందుకు రెండు ఫ్యామిలీస్ వారు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాము.

అన్నపూర్ణ స్టూడియోస్ లో( Annapurna Studios ) తాతగారి విగ్రహం ముందు పెళ్లి చేసుకోవడం అన్నది చాలా ఆనందంగా ఉంది.

అయన ఆశీస్సులు ఉంటాయని అనుకుంటున్నాము. """/" / శోభిత నన్ను చాలా బాగా అర్ధం చేసుకుంటుంది.

ఆమెతో చాలా డీప్ గా కనెక్ట్ అయ్యాను.శోభిత నా లైఫ్ లోకి రావడం చాలా హ్యాపీగా ఉంది.

శోభితతో లైఫ్ షేర్ చేసుకోవడానికి ఎదురు చూస్తున్నాను.నాలో ఖాళీని శోభిత పూర్తి చేస్తుంది.

ముందు ముందు మాది అద్భుతమైన ప్రయాణం అవుతుంది అని నాగ చైతన్య చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా నాగచైతన్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇకపోతే త్వరలోనే మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్న ఈ జంటకు సంబంధించిన పెళ్లి ఏర్పాట్లు ప్రస్తుతం జరుగుతున్నాయి.

హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?