ఆ విషయం నాకు మాత్రమే తెలుసు… శోభిత పెళ్లి ఫోటోలపై సమంత కామెంట్స్!
TeluguStop.com
సినీ నటుడు నాగచైతన్య( Nagachaitanya ) శోభిత ( Sobhita ) వివాహం డిసెంబర్ 4వ తేదీ ఎంతో ఘనంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక శోభిత నాగచైతన్య కూడా వారి పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇదిలా ఉండగా శోభిత సోదరి సమంత( Samantha ) గురించి కూడా అందరికీ తెలిసిందే.
ఈమె తన అక్క పెళ్లి సమయం నుంచి సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
"""/" /
వృత్తిరీత్యా డాక్టర్ అయినటువంటి సమంత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తరచూ తన అక్క శోభితకి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
తాజాగా ఈమె నాగచైతన్య శోభిత పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.
ఇలా తన అక్క పెళ్లి ఫోటోలను షేర్ చేసిన ఈమె తన అక్క గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
ఇది నా జీవితంలో చాలా ఎమోషనల్ మూమెంట్ అక్క. """/" /
నిన్ను చాలా ప్రేమిస్తున్నాను.
మమ్మల్ని నువ్వు ఎంత ఇష్టపడతావో.అలాగే నీ జీవితంలోకి వచ్చిన వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తావో నాకు మాత్రమే తెలుసు.
అత్యంత గౌరవప్రదమైన జంట అక్క- చైతూ అంటూ ఇవే సోషల్ మీడియా వేదికగా తన అక్క బావకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక శోభిత నాగచైతన్య ఇద్దరు కలిసి ఎలాంటి సినిమాలలోనూ నటించలేదు కానీ వీరిద్దరూ ప్రేమలో పడటం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవడం జరిగింది.
నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత శోభిత ప్రేమలో పడ్డారు.ఇలా రెండు సంవత్సరాలు పాటు ప్రేమలో ఉన్న ఈ జంట డిసెంబర్ 4వ తేదీ కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.
రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?