మేజర్ లో శోభిత పాత్రని పరిచయం చేసిన అడవి శేష్... హీరోయిన్ కాదు
TeluguStop.com
ముంబై టెర్రర్ ఎటాక్స్ లో ప్రాణాలు కోల్పోయిన రియల్ లైఫ్ హీరో సందీప్ ఉన్నికృష్ణన్ లైఫ్ స్టొరీ బేస్ చేసుకొని అడవి శేష్ మేజర్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాని సూపర్ స్టార్ మహేష్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తెలుగమ్మాయి శోబిత దూలిపాళ్ళ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుంది.
అయితే ఆమె హీరోయిన్ గా కనిపిస్తుందని ఉన్ని కృష్ణన్ లవ్ స్టొరీలో ఆమె పాత్ర ఉంటుందని అందరూ భావించారు.
ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ గా సాయీ మంజ్రేకర్ కూడా నటిస్తున్న నేపధ్యంలో శోభిత పాత్ర ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి ప్రేక్షకులలో ఉంది.
ఈ నేపధ్యంలో తాజాగా మేజర్ సినిమాలోని శోభిత పాత్రని పరిచయం చేశాడు.ఆమె ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.
ఈ లుక్ లో టెర్రర్ ఎటాక్స్ జరిగిన హోటల్ లో చిక్కుకున్న అమ్మాయిగా శోభిత కనిపిస్తుంది.
టెర్రరిస్ట్ లనుంచి ఓ చిన్నారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు ఫస్ట్ లుక్ లో ఉంది.
దీనిని బట్టి శోభిత పాత్ర కూడా సినిమాలో చాలా కీలకంగా ఉంటుందనే టాక్ వినిపిస్తుంది.
ఉగ్రవాదులు హోటల్‌లోకి చొరబడ్డారు.ఆమె కోసం లోపలకు వచ్చారు.
కానీ ఆమె ఎదురు తిరిగి వారితో పోరాడింది అంటూ ఈ పోస్టర్‌ను అడవి శేష్ ట్వీట్ చేశాడు.
ఇదిలా ఉంటే సినిమాలో రియల్ కథాంశం ప్రకారం శోభిత పాత్ర కూడా చనిపోతుందని తెలుస్తుంది.
అయితే చనిపోయే చివరి నిమిషం వరకు అందులో ఉన్నవారి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసే యువతిగా ఆమె పాత్ర కనిపించబోతుంది.
వీడే అసలైన జీనియస్.. పని చేయకుండానే కోట్లు సంపాదిస్తున్నాడు.. ఎలాగో తెలుసా?