శోభన్ బాబు ని భయంకరంగా భయపెట్టింది ఏంటో తెలుసా.. ?
TeluguStop.com
శోభన్ బాబుతెలుగు తెరపై అందాల హీరో.తన నటనతో పాటు అందానికి అప్పట్లో అమ్మాయిలు పడి చచ్చేవారు.
తన చక్కటి రూపానికి తోడు అద్భుత నటనతో మంచి హీరోగా గుర్తింపు పొందాడు.
ఫ్యామిలీ, లవ్ స్టోరీలు బాగా ప్రజెంట్ చేశాడు.వందల సినిమాల్లో నటించి తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు టాలీవుడ్ ను ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి దిగ్గజ హీరోలు ఏలుతున్న సమయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
టాప్ హీరోగా ఎదిగిపోయాడు.అయితే ఈ సోగ్గాడు అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు.
ఎంతో క్రమశిక్షణతో పాటు ఎలాంటి చెడు అలవాట్లు లేని శోభన్ బాబు.తన ఆరోగ్యం గురించి చాలా కేర్ తీసుకునేవాడు.
శోభన్ బాబు జీవితంలో సిగరెట్, మద్యం తీసుకునే వాడు కాదు.తిండి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేది.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా శోభన్ బాబు ఎందుకు చనిపోయడు అనేది జనాల్లో రేకెత్తిన ప్రశ్న.
ఆయన ఎప్పుడూ హాస్పిటల్ కు వెళ్లింది కూడా లేదు.వయసు 70 ఏండ్లు దాటినా చక్కటి ఆరోగ్యంతో ఉండేవాడు.