Sobhan Babu : తనని కాదని వేరే హీరోను పెడితే శోభన్ బాబు ఏం చేశాడో తెలుసా?

సినీ పరిశ్రమలలో హీరోలదే హవా.వారు ఏం చెబితే అది వినాలి.

ఏం అడిగితే అది ఇవ్వాలి.సినిమా కు డబ్బులు పెట్టె నిర్మాత కంటే హీరోకే ప్రాధాన్యం ఎక్కువ.

సినిమా హిట్ ఐతే హీరో క్రేజ్ పెరుగుతుంది.నెక్స్ట్ సినిమాకు రెమ్యూనిరేషన్ పెరుగుతుంది.

అవకాశాలు పెరుగుతాయి.అవార్డులు వస్తాయి.

కానీ నిర్మాత మాత్రం తేరా వెనుకనే ఉండిపోతాడు.సినిమా ప్లాప్ ఐన హీరోకు జరిగే నష్టం ఏమి ఉండదు.

తన రెమ్యూనిరేషన్( Remuneration ) తాను తీసుకొని వెళ్ళిపోతాడు.కానీ నిర్మాత అప్పులపాలు కావడం ఖాయం.

చాలా కాలంగా ఇండస్ట్రీలో ఇదే పరిస్థితి.ఒకప్పుడు ఇండస్ట్రీలో నిర్మాతల పరిస్థితి మరోలా ఉండేది.

వారు చెప్పిందే ఫైనల్.వారు ఎవరంటే వారే హీరో.

వారు ఎంతంటే అంతే రెమ్యూనిరేషన్.నమ్మలేకపోతున్నారా? ఐతే ఇది వినండి.

"""/" / ఏం ఎస్ రెడ్డి( M.S.

Reddy ) గారు మనందరికీ తెలిసిన ఒక గొప్ప నిర్మాత.అంకుశం, సంపూర్ణ రామాయణం వంటి అద్భుతమైన చిత్రాలను నిర్మించారాయణ.

ఆయన తన కౌముది పిక్చర్స్ బ్యానర్ లో కన్నడలో అద్భుతమైన విజయం సాధించిన నాగహారావు అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చెయ్యాలనుకున్నారట.

ఇందుకు కృష్ణ గారి( Krishna )ని హీరోగా ఫైనల్ చేశారట.ఈ విషయం శోభన్ బాబు కు తెలిసింది.

శోభన్ బాబు( Sobhan Babu ) గారు అప్పటికే కౌముది పిక్చర్స్ బ్యానర్ మొదటి రెండు సినిమాలు చేసి ఉన్నారు.

శోభన్ బాబు, ఏం ఎస్ రెడ్డి గారి ఆఫీస్ కి ఉదయం 8 గంటలకు వెళ్లి విజిటర్స్ చైర్ లో కూర్చొని ఆయన కోసం వెయిట్ చేశారట.

ఏం ఎస్ రెడ్డి గారు రాగానే ఆయన దగ్గరకు వెళ్లి కౌముది పిక్చర్స్ తనకు మాతృసంస్థ అని, కనుక ఈ సినిమా అవకాశం కూడా తనకే ఇవ్వాలని బ్రతిమాలాడట.

రెడ్డి గారు ఎంత నచ్చజెప్పాలని చూసిన వినలేదట.చివరకు ఆయన కృష్ణ గారికి బదులు శోభన్ బాబు ను హీరోగా పెట్టి ఆ సినిమా తీశారు.

ఆ చిత్రమే "కోడె నాగు( Kode Nagu )".ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు.

"""/" / ఆలా ఉండేది నిర్మాతల పరిస్థితి.కానీ ఇప్పుడు, హీరోల డేట్ లు కోసం నిర్మాతలు పాకులాడాల్సిన పరిస్థితి.

ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితిలో కాస్త మార్పు వస్తోంది.హీరోల నుంచి డైరెక్టర్ల వైపు దృష్టి మళ్లుతోంది.

రాజమౌళి, సుకుమార్ వంటి దర్శకులు తమ బ్రాండ్ తో సినిమాలను ఆడిస్తున్నారు.కానీ నిర్మాతలకు మాత్రం ఇంకా మంచి రోజులు రాలేదు.