దర్శకుడు విశ్వనాథ్ ని శోభన్ బాబు అందరి ముందే ఇంత మాట అన్నారా ?
TeluguStop.com
1975 సంవత్సరంలో శోభన్ బాబు( Shobhan Babu ) వాణిశ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా జీవనజ్యోతి.
ఈ చిత్రంలో వాణిశ్రీ నటన అద్భుతం అని చెప్పాలి.ఆమె నటించిన విధానం అలాగే సినిమా కథ కూడా అద్భుతంగా ఉండడంతో ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.
అంతేకాదు ఈ సినిమా విజయం లో వాణిశ్రీ కీలక పాత్ర పోషించిందని ఒప్పుకోవాలి.
అయితే ఈ చిత్రానికి కథ అందించింది మాత్రం ఆరుద్ర భార్య అయిన రామలక్ష్మి.
ఆమె రచయితగా చాలా ఏళ్ళు సినిమా పరిశ్రమలో పనిచేసిన విషయం మనందరికీ తెలుసు.
ఇక ఈ సినిమాకి దర్శకత్వం వహించింది కే విశ్వనాథ్ కావడం విశేషం. """/" /
వాణిశ్రీ, రామలక్ష్మి మంచి స్నేహితులు కావడంతో వాణిశ్రీ ( Vanishree )అడగడంతో రామలక్ష్మి( Rama Lakshmi ) ఈ చిత్రం యొక్క కథను తయారు చేశారు.
అలాగే విశ్వనాథ్ సైతం ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు అయితే ఈ సినిమా ఘనవిజయం సాధించిన తర్వాత స్టేజ్ పైన ఒక సక్సెస్ మీట్ లో ఇకపై వేరే రచయితలు అందించిన కథలు తాను సినిమాలుగా తీయబోనని తన సొంత కథల పైనే తను సినిమా తీయాలనుకుంటున్నాననే విషయాన్ని విశ్వనాథ్ ప్రకటించారు.
ఈ విషయం మాట్లాడిన తర్వాత శోభన్ బాబు మైకు తీసుకుని విశ్వనాథ్ గారిని వారించారు.
మీరు ఇలాంటి మాట మాట్లాడడం చాలా తప్పు.ఈ సినిమా విజయంలో రామలక్ష్మి కీలక పాత్ర పోషించింది అంటూ ఫైర్ అయ్యారు.
"""/" /
వాణిశ్రీ కోసమే ఆమె ఈ కథ రాసింది మీరు కానీ మరొక ఏ దర్శకుడు అడిగినా కూడా ఈ పని చేసి పెట్టేది కాదు అంటూ శోభన్ బాబు చెప్పడం అప్పట్లో పెద్ద సంచలనమే అయింది.
జీవనజ్యోతి సినిమా అటు శోభన్ బాబుకు, దర్శకుడిగా విశ్వనాథ్( Vishwanath ) కి, రామలక్ష్మి కి, వాణిశ్రీ కి అందరికీ మంచి పేరు తీసుకువచ్చింది.
ఇక విశ్వనాథ్ ఈ మాట చెప్పడం వెనక అసలు కారణం జీవన జ్యోతి సినిమా స్క్రిప్ట్ ఆయనకు నచ్చకపోవడమే అంటారు కొంతమంది.
అయినా కూడా నిర్మాత బలవంతం కొద్ది ఈ సినిమా చేశారని కానీ ఈ చిత్రం ఇంత పెద్ద ఘన విజయం సాధిస్తుందని ఆయన ఊహించలేదని, విజయం సాధించిన తర్వాత అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం పట్ల కొంతమంది పెదవి విరిచారు.