ఆ విషయంలో చాలా భయం వేస్తుంది…దయచేసి అర్థం చేసుకోండి!
TeluguStop.com
మెగా హీరో సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) తాజాగా తన మామయ్య పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తో కలిసి బ్రో సినిమా( Bro Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికి కలెక్షన్ల పరంగా మంచి వస్తువులను రాబట్టాయని తెలుస్తుంది.
ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నటుడు సాయిధరమ్ తేజ్ పలు ప్రాంతాలలో పర్యటిస్తూ భారీ స్థాయిలో సినిమాని ప్రమోట్ చేస్తున్నారు.
ఇలా ప్రాంతాలలో తన యాత్రను ముగించుకొని అభిమానులను ఉద్దేశిస్తూ సోషల్ మీడియా వేదికగా తనకు చాలా భయం వేస్తుంది అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మరి సాయిధరమ్ తేజ చేసిన ఈ పోస్ట్ లో ఏముంది అనే విషయానికి వస్తే.
"""/" /
అందరికీ నమస్కారం బ్రో విజయ యాత్రలో భాగంగా మీరు నా పట్ల చూపించిన అభిమానానికి థాంక్యూ.
మిమ్మల్ని కలుసుకోవడం, మీరు నాపై చూపించిన ప్రేమ సినిమా గురించి మీరు మాట్లాడిన మాటలు వింటుంటే నాకు చాలా సంతోషం అనిపించింది.
అయితే నన్ను చూడటానికి వచ్చిన వారందరూ కూడా నాతో సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేశారు.
తాను సాధ్యమైనంత వరకు అందరికీ అందుబాటులోనే ఉంటానని తెలియజేశారు.అయితే చాలామంది ఈ విజయ యాత్రలో పాల్గొన్నప్పుడు హెల్మెట్( Helmet ) పెట్టుకోకుండా తనని ఫాలో అవుతూ పెద్ద ఎత్తున సెల్ఫీలు వీడియోలు తీస్తూ వచ్చారని ఈయన తెలిపారు.
"""/" /
ఈ విధంగా హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ఎంతో ప్రమాదం దయచేసి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించండి.
హెల్మెట్ లేకుండా మిమ్మల్ని అలా చూడటంతో తనకు భయం వేసిందని, దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని బైక్ పై ప్రయాణించే సమయంలో హెల్మెట్ ధరించండి అంటూ ఈయన అభిమానులకు సూచించారు.
హెల్మెట్ లేకుండా మీరు అభిమానంతో ఇలా చేస్తున్న సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే నేను తీవ్రమైన మనస్థాపానికి గురవుతాను.
దయచేసి మీరు బైక్ పై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించండి ఎట్టి పరిస్థితులలో కూడా దీనిని మర్చిపోకండి అంటూ ఈ సందర్భంగా ఈయన అభిమానులకు జాగ్రత్తలు చెబుతూ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
బాలయ్య దబిడి దిబిడి సాంగ్ కోసం ఊర్వశి షాకింగ్ రెమ్యూనరేషన్.. ఎంతంటే?