కనుక దుర్గమ్మ నైవైద్యానికి ప్రత్యేక ధాన్యం.. కానుకనిచ్చిన ఎన్నారై..

బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి ప్రతిరోజు ఎన్నో వేల మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు.

అలా వచ్చిన ఒక ఎన్నారై బెజవాడ దుర్గమ్మకు అరుదైన ప్రసాదం సమర్పించారని దేవాలయ అధికారులు వెల్లడించారు.

సేంద్రీయ విధానంలో ఎలాంటి రసాయనాలు లేకుండా పండించిన 365 రకాల బియ్యాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు.

అమెరికాలో స్థిరపడ్డ హైదరాబాద్ కు చెందిన కే.మౌనిక రెడ్డి, శిరీష రెడ్డి అమ్మవారికి 365 రకాల సేంద్రియ బియ్యం అందించేందుకు ముందుకు వచ్చారు.

గుంటూరు జిల్లా అత్తోట గ్రామానికి చెందిన రైతు పాపారావు పాలేకర్ విధానంలో వరి సాగు చేస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న శిరీష రెడ్డి సేంద్రియ బియ్యం అమ్మవారికి సమర్పించుకునేందుకు ముందుకు వచ్చారు.

ప్రతిరోజు 50 కిలోల చొప్పున సంవత్సరం పాటు వారు సేంద్రీయ బియ్యాన్ని అందించనున్నారు.

ఆ బియ్యంతో అమ్మవారికి నైవేద్యంతో పాటు ప్రసాదాలు కూడా తయారు చేసి భక్తులకు పంచనున్నారు.

"""/"/ ముందుగా 21 రకాల సేంద్రియ బియ్యాన్ని శిరీష రెడ్డి దేవాలయ ఆలయ ఈవో భ్రమరాంబకు అందించారు.

బలరాం సాల్, హవలిగట్టి, కళావతి బ్లాక్ రైస్, జలక, ఉజల మణిపాల్, నవారా, రూబా ఫుల్, సుడిదాన్యం, బైరలోడు, సురమటియ, దేవరాణి, బారాగలి, బడావోష్, ఘని, కామిని భోగ్, సికి బాలి, రమ్య గలి, అలసకీబా, కంద సాగర్, లెండముగియ, దాసరబలి, కుసుమ, ఇంద్రాణి లాంటి ఎంతో అరుదైన, విలువైన బియ్యాన్ని, ఒక్కో రకం 8 కేజీల చొప్పున అమ్మవారికి సమర్పించారు.

వీటిని అమ్మవారి మహా నివేదన కొరకు భక్తులకు ప్రసాదముగా అందజేయనున్నట్లు ఆలయ కార్యా నిర్వహణ అధికారి భ్రమరాంబ వెల్లడించారు.

"""/"/ ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయిన అరుదైన ధాన్యం రకాలను కూడా తమకు అందిస్తున్నందుకు దేవాలయ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

దేవాలయాల్లో నైవేద్యాలకు, ప్రసాదాలకు కేవలం సేంద్రీయ పద్ధతుల్లో పండించిన పంటలను మాత్రమే వాడాలని నిబంధన అమల్లోకి తీసుకురావాలని అమ్మవారి భక్తులు కోరుతున్నారు.

ఇలా చేస్తే సేంద్రియ విధానంలో పండించిన రైతులకు గిట్టుబాటు ధర దక్కుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో సెలబ్రిటీ స్టేటస్ ను అందుకున్న సినీ ప్రముఖులు వీళ్లే!