ఈ వ‌య‌స్సులోనే ఇంత ట్యాలెంటా.. ఈ బుడ్డోడు మామూలోడు కాదు!

కొందరు పుట్టుకతోనే తెలివిమంతులు.మరి కొందరికి ఎంత వయస్సు పెరిగినా.

తెలివి మాత్రం పెరగదు.బుద్ది పెరగదు.

ఏం చెప్పినా అర్థం కాదు.అర్థం చేసుకోరు.

కానీ మరి కొందరు మాత్రం ఒక్క సారి ఏదైనా విషయం చెబితే దానిని ఎప్పటికీ మర్చిపోరు.

అలాంటి కోవలోకే వస్తాడు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే బుడ్డొడ్డు.మన తెలుగు రాష్ట్రానికి చెందిన డాక్టర్ రవితేజ, డాక్టర్​ లక్ష్మి తేజ దంపతులు.

వాళ్లు దుబాయ్​లో సెటిల్​ అయ్యారు.వారి కుమారుడి పేరు క్రితిక్​ తంగిరాల.

వయసు 4 సంవత్సరాలు.వయస్సు చిన్నదే కానీ మనోడి ట్యాలెంట్ మాత్రం పెద్దదే.

ఇప్పుడే ఆ బుడ్డోడి గురించి మనం చర్చించుకుంటున్నాం అంటే ఆ చిచ్చర పిడుగు తెలివి ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాలి.

ఇంతకీ ఆ చిన్నోడు ఏం చేశాడంటారా? మనం ఎన్ని రోజులు బట్టీ పట్టిన గుర్తు ఉండని విషయాలను మనోడు అవలోకగా అప్పజెప్పేస్తున్నాడు.

105 దేశాలు, వాటి రాజధానులు గుక్క తిప్పుకోకుండా చెబుతున్నాడు.అలాగే సంస్కృత శ్లోకాలు, ఖండాలు, సౌర కుటుంబం, వాటి వర్ణణ వంటి వివరాలను తెలియజేస్తున్నాడు.

ఈ చిన్నోడి ట్యాలెంట్ ను గుర్తించి ఇండియా బుక్​ ఆఫ్​ ట్యాలెంట్​ వారు తమ బుక్​లో స్థానం కల్పించారు.

ఇంత చిన్న వయసులోని ఈ చిన్నారి క్రితిక్​ తెలుగింటి సంప్రదాయాలు, సంస్కృత శ్లోకాలపై ఆసక్తి కనబరుస్తున్నాట.

మనం ఇక్కడే ఉండి మన కల్చర్​ను మర్చిపోతున్నాం.కానీ వారి కుటుంబం మొత్తం దుబాయ్​లో సెటిల్​ అయినప్పటికీ మన తెలుగు సంప్రదాయలను మర్చిపోలేదు.

తమ పిల్లలకు ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలు చెబుతున్నారు.ఇప్పటికైనా ఇక్కడ ఉంటున్న మన పిల్లలకు కూడా మన సంప్రదాయాల గొప్పదనం గురించి చెబుతూ ఉండాలి.

అలాగే చిన్నప్పటి నుంచి వారిలో తెలివిని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.వారంతట వారే ఈ లోకాన్ని తెలుసుకునేందుకు అవసరమైన జ్ఞానం అందించాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్17, సోమవారం 2024