మీ అభిమానం చల్లగుండ.. ఒకే పోస్టర్ లో ఇన్ని వెరియేషన్స్!
TeluguStop.com
సంక్రాంతి పండుగ( Sankranti Festival ) సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు ఉత్సాహం, ఆనందంతో గడుపుతున్నారు.
పండుగ సమయాల్లో ప్రజలు ఫెస్టివల్ వైబ్‌లో మునిగిపోయి, చుక్క ముక్క అంటూ సందడి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కొందరు గ్రామాల్లోని ప్రముఖులు తమ స్వంత అభిమానాన్ని ప్రదర్శించుకోవడంలో బాగా ముందు ఉంటారు.
ఇందుకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం ఒక సాధారణ సంప్రదాయం.ఇలాంటి సొంత ప్రమోషన్ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో తాజాగా ఒకటి ప్రత్యేకంగా నిలుస్తోంది.
ప్రస్తుతం ఈ బ్యానర్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
"""/" /
ఇక అసలు విషయానికి వెళ్తే.తెలంగాణ - ఆంధ్ర ( Telangana - Andhra )సరిహద్దులో ఉన్న ముగ్గు వెంకటాపురం గ్రామంలో వెలిసిన ఈ ఫ్లెక్సీ ఎంతో ఆసక్తిని రేపుతోంది.
ఫ్లెక్సీలో మూడు ప్రముఖుల ఫోటోలు కనిపిస్తున్నాయి.మొదటిగా, "బాస్ ఈజ్ బ్యాక్" అంటూ చంద్రబాబు( Chandrababu ) నాయుడి ఫోటో, మధ్యలో ‘డాకు మహరాజ్’( Daku Maharaj ) టైటిల్‌తో బాలకృష్ణ ఫోటో, ఇక చివరగా "బాస్ ఈజ్ కమింగ్ సూన్" అని కేసీఆర్ ( KCR )ఫోటో ఉంది సనాక్రాంతికి శుభాకాంక్షలు చెబుతున్నట్లుగా ఉంది.
"""/" / ఈ ఫ్లెక్సీకి సంబంధించిన ఫోటోలు చూస్తూ స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
"ఇదేం కాంబినేషన్ రా బాబు" అంటూ జనం నోరెళ్లబెడుతున్నారు.పండుగ సమయానికి సంబంధించిన చమత్కారంగా ఉన్నా, ప్రజలు ఈ సరదా ఫ్లెక్సీని చూసి పలు రకాల కామెంట్లను చేస్తున్నారు.
అసలు ఇలా ఎలా ఆలోచనలు వస్తాయి అని కొందరు కామెంట్ చేస్తుంటే.మరికొందరేమో ని ఆలోచన సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
మరి ఇంకెందుకు ఆలస్యం మీకేమనిపించిందో ఓ కామెంట్ రూపంలో తెలపండి.
భారతీయులకు గుడ్ న్యూస్.. ఈ దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చని తెలుసా?