రఘునందన్ విషయంలో అలా.. కోమటిరెడ్డి విషయంలో ఇలా..
TeluguStop.com
కేసీఆర్ అనూహ్యంగా ఈ మధ్య జిల్లాల పర్యటన ప్రారంభించారు.అయితే ఇక్కడే ఆయనకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి.
అదేంటంటే ఆ నియోజకవర్గాల్లో ఉన్న ప్రతిపక్ష నేతలను పిలవాల్సి వస్తోంది.అసలు ఆయనకు వారంటే గిట్టదు.
మళ్లీ వారితో పాల్గొనాలా అని అనుకుంటున్నారేమో గానీ వారిలో కొందర్ని పిలుస్తున్నారు మరి కొందర్ని పిలవట్లేదు.
ఇప్పుడు ఇదే విషయంపై ఏకంగా ఓ ఎంపీ కేంద్రానికి ఫిర్యాదు చేశారు.కేసీఆర్ నిన్న వాసాలమర్రిని గ్రామానికి వెల్లిన సంగతి తెలిసిందే.
ఆ ఊరిని దత్తత తీసుకుంటానని ప్రకటించి అందరితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు సీఎం కేసీఆర్.
ఈ కార్యక్రమంలో భాగంగా ఆ ఊరిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.అలాగే ఊరి కోసం తాను మరిన్ని నిధులు ప్రకటన కూడా చేశారు.
ఇంత వరకు బాగానే ఉన్నా.వాసాలమర్రి భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి పరిధిలోకి వస్తుంది.
అయితే ఆయనకు మాత్రం ఆహ్వానం ఇవ్వకుండా అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణకు సీఎం అయిన కేసీఆర్ తన భువనగిరి నియోజకవర్గ పరిధిలో పర్యటించినప్పటికీ తనను పిలవలేదని, ఇది ప్రొటోకాల్ ఉల్లంఘనే అని చెప్పారు.
"""/"/
అంతే కాదు ఈ విషయంపై కేంద్రానికి ఫిర్యాదు చేసి మరీ పంతానికి పోయారు ఎంపీ కోమటిరెడ్డి.
మంగళవారం ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను కలిసి మరీ ఈ విషయంపై ఆయనే స్వయంగా ఫిర్యాదు ఇవ్వడం చర్చీనీయాంశంగా మారింది.
అయితే కేసీఆర్ సిద్దిపేటకు వెళ్లినప్పుడు మాత్రం నియోజకవర్గ పరిధి కాకపోయినా జిల్లాలో ఉన్నాడని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావును మాత్రం ఆహ్వానించారు.
మరి అక్కడ పాటించిన ప్రొటోకాల్ ఇక్కడ కూడా పాటిస్తే బాగుండని అంతా అనుకుంటున్నారు.
ఇలాంటి చిన్న మిస్టేక్‌లే విమర్శలకు తావిస్తాయి కాబట్టి దానిపై కేసీఆర్ ఫోకస్ చేయాలని అంతా భావిస్తున్నారు.
మరి దీనిపై అధికారులు ఏమైనా స్పందిస్తారా లేదా అన్నది చూడాలి.
వామ్మో.. అక్కడ ప్రతి ఒక్క మహిళకి ఆరు అడుగులపైనే జుట్టు.. ఎందుకంటే?