మంచు ఎఫెక్ట్: ఏకంగా 10 గంటల సేపు కారులో చిక్కుకుపోయిన వ్యక్తి.. చివరకు..?! .

మంచు ఎఫెక్ట్: ఏకంగా 10 గంటల సేపు కారులో చిక్కుకుపోయిన వ్యక్తి చివరకు?! .

మంచు కురుస్తుంటే చూడడానికి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది కదా.ఆ చల్లటి వాతావరణంలో ముత్యాలలాంటి బిందువులు అలా కిందకు జారువారుతుంటే చూడడానికి ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుంది.

మంచు ఎఫెక్ట్: ఏకంగా 10 గంటల సేపు కారులో చిక్కుకుపోయిన వ్యక్తి చివరకు?! .

అయితే, చూడడానికి ఎంతో అందంగా కనిపించే మంచు కూడా ఒక్కోసారి ప్రమాదకరంగా మారుతుంది.

మంచు ఎఫెక్ట్: ఏకంగా 10 గంటల సేపు కారులో చిక్కుకుపోయిన వ్యక్తి చివరకు?! .

ఎప్పుడో ఒకసారి మంచుని చూసి ఎంజాయ్ చేసే మనకి దాని వలన కలిగే నష్టాల గురించి తెలియదు.

మంచు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మాత్రం ఆ మంచు వల్ల కలిగే నష్టాలు ఏంటో బాగా తెలుసు.

అందుకే వారు ఎప్పుడూ చాలా అప్రమత్తంగా ఉంటారు.ఒక్కోసారి బయట దట్టమైన పోగ మంచు పేరుకుపోవడం వలన వాళ్ళు తమ ఇళ్లలోనే బందిఖానాలు అవుతారు.

ఇప్పుడు అసలు ఏమైంది అని మీరు అనుకుంటున్నారు కదా.? మంచు గురించి చెప్పడానికి గల కారణం ఏంటంటే.

ఈ మంచు వలన ఓ వ్యక్తికి ఊహించని చేదు అనుభవం ఎదురైందట.బయటకు వెళదామని కార్ లో ప్రయాణం చేస్తున్న అతను అకస్మాత్తుగా కురిసిన మంచు వర్షం వల్ల కారులో చిక్కుకుపోయాడు.

కానీ, అతని సమయస్ఫూర్తి వలన ప్రాణాలతో బయటపడ్డాడు.న్యూయార్క్‌లోని ఒవెగోలో నివసిస్తున్న కెవిన్ క్రెసెన్ అనే 58 ఏళ్ల వ్యక్తి ఎప్పటిలాగానే కారులో బయటకు వెళ్తున్నాడు.

అతను వెళ్లే సమయానికి మంచు వర్షం పెద్దగా కురవడం లేదు.సరే వాతావరణం అనుకూలంగానే ఉంది కదా అని త్వరగా వెళ్లి వచ్చేద్దాం అనుకుని బయలుదేరాడు.

కానీ, కొంత దూరం వెళ్ళాక అక్కడ వాతవరణం ఒక్కసారిగా మారిపోయింది.మంచు కాస్త తీవ్ర తుఫాన్ గా మారిపోయింది.

ఏమి చేయాలో తెలియని పరిస్థితులలో కెవిన్ తన కారు వేగాన్ని పెంచాడు.అయితే కారు కాస్త జారుకుంటూ పక్కనే ఉన్న చిన్న మురుగు కాలువలోకి వెళ్లి ఇరుక్కుపోయింది.

కారు డోర్ నుంచి బయటకు వద్దామని అనుకున్నాడు.దురదృష్టవశాత్తు ప్రమాదం వల్ల కారు డోర్లు కూడా బిగిసిపోయాయి.

ఏమి చేయాలో కెవిన్ కి అర్ధం కావడం లేదు.ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తూనే ఉండటం వల్ల కెవిన్ కారు నుంచి బయటకు రాలేపోయాడు.

దీంతో కారు మీద, దాని పక్కన సుమారు 40 ఇంచులు మందంతో మంచు అంతా పేరుకుపోయింది.

ఇంకా కొంచెం మంచు పడితే అసలు కారు కనపడేది కాదు.సుమారు 10 గంటల సేపు అతడు కారులోనే బందీ అయ్యాడు.

అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చి కెవిన్ పోలీస్ హెల్ప్‌లైన్ ‌కు కాల్ చేసి తన సమస్యను చెప్పాడట.

పోలీసులకు కార్ కనిపించలేదు.ఎందుకంటే ఆ కారును మంచు కప్పేసి ఉంది.

దాంతో సుమారు 10 గంటలు పాటు అతడు కారులోనే ఉన్నాడు.ఇంకా చేసేది లేక కెవిన్ తన ప్రాణాల మీద ఆశలు వదిలేసుకున్న సమయంలో ఒక పెద్ద శబ్దం అతనికి వినిపించింది.

తన కారు మీద ఉన్న మంచును ఎవరో క్లీన్ చేస్తున్న శబ్దం అది.

వెంటనే తన ఫోన్ రింగ్ అయింది.ఫోన్ ఎత్తగానే అవతలి వైపు నుంచి పోలీసు అధికారి మాట్లాడుతున్నాడు.

‘‘మీరు చిక్కుకున్నది ఈ కారులోనేనా.? మీకు శబ్దాలు ఏమైనా వినిపిస్తున్నాయా.

?’’ అని అడిగాడు.ఆ అధికారి మాటలు విన్నాక కెవిన్‌కు తాను బతుకుతానన్న ఆశ చిగురించింది.

‘‘అవును.ఈ కారే’’ అని సమాధానం చెప్పాడు.

అయితే కారు తలుపులు బిగుసుకుపోడంతో పోలీసులు అద్దాలు బద్దలకొట్టి కెవిన్‌ను రక్షించారు.బతుకు జీవుడా.

అనుకుంటూ బయటకు వచ్చాడు.లేకపోతే అతడు కారులోనే అలా సజీవ దహనం అయ్యేవాడు.

ఆపద సమయంలో కెవిన్ అధికారులకు ఫోన్ చేయకపోయినా, కెవిన్ ఫోన్ చేసిన వెంటనే అధికారులు స్పందించకపోయిన కెవిన్ ప్రాణాలతో బయటపడేవాడు కాదు.

వామ్మో గంగవ్వని చూశారా… ఇలా తయారయ్యిందేంటి… అసలు గుర్తుపట్టలేరుగా? 

వామ్మో గంగవ్వని చూశారా… ఇలా తయారయ్యిందేంటి… అసలు గుర్తుపట్టలేరుగా?