Chandini Chowdary : గెస్ట్ హౌస్ కు రాకపోతే ఫోటోలు మార్ఫ్ చేస్తామని చాందిని చౌదరికి బెదిరింపులు.. చివరకు?
TeluguStop.com
తెలుగులో మంచి గుర్తింపును కలిగి ఉన్న హీరోయిన్లలో చాందిని చౌదరి( Chandini Chowdary ) ఒకరు.
చాందిని చౌదరికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.చాందిని చౌదరి నటించిన గామి సినిమా( Gami Movie ) ఈ నెలలో థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
అయితే ప్రముఖ నటి స్నిగ్ధ ( Actress Snigdha )ఒక ఇంటర్వ్యూలో చాందిని చౌదరి గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఒకరోజు చాందిని చౌదరికి కొత్త నంబర్ నుంచి మెసేజ్ వచ్చిందని ఆ మెసేజ్ లో గెస్ట్ హౌస్ కు రావాలని గెస్ట్ హౌస్ కు రాని పక్షంలో ని ఫోటోలు, వీడియోలు మార్ఫ్ చేస్తా అని ఉందని ఆ సమయంలో చాందిని చౌదరి తెగ ఏడ్చేసిందని స్నిగ్ధ చెప్పుకొచ్చారు.
అయితే అలా బెదిరించింది నేనేనని కొత్త నంబర్ నుంచి మెసేజ్ చేసి ఏడిపించానని స్నిగ్ధ వెల్లడించారు.
ఈ విషయం తెలిసి స్నిగ్ధలో ఇలాంటి టాలెంట్ ఉందా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
"""/" /
చాందిని చౌదరి ఏడ్చేసిందని తెలిసి నెటిజన్లు షాకవుతున్నారు.చాందిని చౌదరి స్ట్రాంగ్ గా ఉండాలని ఇలాంటి చిన్నచిన్న విషయాలకు భయపడటం ఏంటని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
గామి మూవీ సక్సెస్ తో చాందిని చౌదరికి ఆఫర్లు సైతం పెరిగాయని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
చాందిని చౌదరి రెమ్యునరేషన్ సైతం పెరిగిందని తెలుస్తోంది. """/" /
చాందిని చౌదరి భవిష్యత్తులో ఎలాంటి ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాల్సి ఉంది.
చాందిని చౌదరి తెలుగమ్మాయి అయినా కెరీర్ పరంగా ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించకపోవడం ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది.
టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆమెను ప్రోత్సహిస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
మెల్‌బోర్న్ టెస్టులో షాకింగ్ సంఘటన.. విరాట్ కోహ్లీని ఆలింగనం చేసేందుకు ప్రయత్నించిన ప్రేక్షకుడు