భర్త క్షేమం కోసం సంచలన నిర్ణయం తీసుకున్న స్నేహ రెడ్డి..41 రోజులపాటు ఉపవాసం!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) అరెస్ట్ కావడంతో ఈ విషయం కాస్త పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది.

ఒకవైపు ఇండస్ట్రీలోనూ మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా అల్లు అర్జున్ సంచలనం రేపింది.

ఇకపోతే అల్లు అర్జున్ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్ ఎప్పుడైతే నంద్యాల ప్రచార కార్యక్రమాలకు వెళ్లారు అప్పటినుంచి ఏదో ఒక విధంగా ట్రోల్ అవుతూనే ఉన్నారు.

పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలియజేయకుండా తన స్నేహితుడి కోసం వెళ్లడంతో మెగా అభిమానులు ఈయనని టార్గెట్ చేస్తూ వచ్చారు.

"""/" / ఈ విషయంలో అల్లు అర్జున్ పై విమర్శలు చేయడమే కాకుండా పుష్ప 2( Pushpa 2 ) సినిమాని అడ్డుకుంటామని, పుష్ప సినిమాపై భారీగా నెగిటివీటిని ప్రచారం చేశారు.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయన సంతోష పడేలోపు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా పోలీసులు అరెస్టు( Arrest ) చేశారు.

ఇలా తరచూ ఏదో ఒక ఇబ్బందులను ఎదుర్కొంటూ అల్లు అర్జున్ వార్తలలో నిలుస్తున్నారు.

ఈ తరుణంలోనే తన భర్త ఈ విధమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలని అలాగే తన భర్త క్షేమంగా ఉండాలని అల్లు స్నేహారెడ్డి( Allu Sneha Reddy ) సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.

"""/" / అల్లు స్నేహారెడ్డి చిన్నప్పటినుంచి ఎంతో ఉన్నతమైన కుటుంబంలో పెరిగిన కొన్ని కట్టుబాట్లను సాంప్రదాయాలను ఎంతో అద్భుతంగా పాటిస్తారు ఏదైనా పూజలు వ్రతాలు వస్తే వాటిని సాంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తూ ఉంటారు.

ఇక ఈమెకు దైవభక్తి కూడా ఎక్కువే అని చెప్పాలి తరుచూ తిరుమల ఆలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు.

అయితే ప్రస్తుతం తన భర్త జైలుకు వెళ్లి రావడంతో ఈమె అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు.

41 రోజులపాటు ఒక పూట ఉపవాసంతో శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలను చదువుతూ ఈమె స్వామి వారికి పూజ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇలా భర్త కోసం స్నేహ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలిసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రాజమౌళి ఆర్టిస్టులను అనౌన్స్ చేసే రోజు ఎప్పుడో తెలిసిపోయిందిగా..?