ఫ్యామిలీతో వెకేషన్ లో చిల్ అవుతున్న బన్నీ… ఫోటోలు వైరల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) ప్రస్తుతం తన సినిమా షూటింగ్ పనులకు చిన్న విరామం ఇచ్చి తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే.

ఇటీవల అల్లు అర్జున్ సరికొత్త లుక్ లో కనిపించి సందడి చేశారు.ఇలా తన గడ్డం మొత్తం ట్రిమ్ చేసి ఈయన కొత్త లుక్ లో కనిపించడంతో ఎన్నో రకాల వార్తల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

పుష్ప సినిమా విషయంలో డైరెక్టర్ హీరో మధ్య గొడవలు జరిగాయని అందుకే సినిమా షూటింగ్ ఆగిపోయింది అంటూ వార్తలు హల్చల్ చేశాయి.

ఇలా సినిమా షూటింగ్ ఆగిపోవడంతోనే బన్నీ తన గెటప్ మొత్తం మార్చారని వార్తలు ఓ రేంజ్ లో చెక్కర్లు కొట్టాయి.

"""/" / ఇలా అల్లు అర్జున్ పుష్ప 2 ( Pushpa 2 ) సినిమా గురించి వస్తున్న ఈ వార్తలన్నింటికీ చెక్ పెడుతూ బన్నీ వాసు( Bunny Vasu ) క్లారిటీ ఇచ్చారు.

కేవలం ఎడిటింగ్ పనుల కారణంగా సినిమా నెలరోజుల పాటు షూటింగ్ పనులను నిలిపి వేసిందని అందుకే అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లారే తప్ప ఎలాంటి గొడవలు జరగలేదని క్లారిటీ ఇచ్చారు.

ఇలా ప్రస్తుతం తన భార్య పిల్లలతో కలిసి వెకేషన్ లో ఉన్న అల్లు అర్జున్ వారి వెకేషన్ కి సంబంధించిన అన్ని విషయాలను స్నేహారెడ్డి( Sneha Reddy ) సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

"""/" / సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే స్నేహారెడ్డి ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు ఈ క్రమంలోనే ప్రస్తుతం నార్వే లోని పల్పిట్ రాక్ వద్ద బన్నీ ఫ్యామిలీతో లాంగ్ షాట్ లో ఇచ్చిన ఫోటోను స్నేహ రెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.

ఇలా సినిమా షూటింగ్ కు కాస్త విరామం ఇచ్చిన అల్లు అర్జున్ ఈ విలువైన సమయాన్ని తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ కనిపించారు.

ఇక ఈ వెకేషన్ పూర్తి కాగానే తిరిగి పుష్ప 2 సినిమా పనులలో బిజీ కానున్నారు.

ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీ విడుదల కానున్న సంగతి తెలిసిందే.

నా మాతృభూమి నాకు ముఖ్యమంటూ రూ.కోట్లు వదులుకున్న సుదీప్.. ఏం జరిగిందంటే?