కాంగ్రెస్ లోకి తుమ్మల ? వెయ్యి కార్ల తో ర్యాలీగా…
TeluguStop.com
తెలంగాణ లో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడే కొద్ది ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి వలసలు జోరందుకున్నాయి.
ఇప్పటికే బీఆర్ఎస్ ( BRS Party )తమ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల లిస్టును ప్రకటించడంతో, టికెట్ దక్కని అసంతృప్తిలంతా కాంగ్రెస్, బిజెపి ( BJP Party )లలో చేరి టికెట్ సంపాదించుకోవాలనే ఆలోచనతో ఉన్నారు.
ఈ మేరకు సంప్రదింపులు చేస్తున్నారు.ఇది ఇలా ఉంటే .
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరావు( Thummala Nageswara Rao ) సైతం పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
"""/" /
ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఎప్పటినుంచో తుమ్మల ఆశలు పెట్టుకున్నారు.
తరచుగా నియోజకవర్గంలో పర్యటిస్తూ. నియోజకవర్గంలో ప్రజలకు దగ్గరవుతూ వస్తున్నారు .
గతంలో చేసిన అభివృద్ధి ఇవన్నీ తనకు కలిసి వస్తాయని తుమ్మల అంచనా వేసుకుంటూ వచ్చారు.
అయితే ఇటీవల ప్రకటించిన బీ ఆర్ ఎస్ అభ్యర్థుల జాబితాలో తుమ్మల పేరు లేకపోవడంతో, ఆయన అసంతృప్తికి గురయ్యారు .
తుమ్మలకు రాష్ట్రవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉండడంతో పాటు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభావం చూపించగలిగిన నేత కావడంతో, ఆయన పార్టీ మారితే ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న పార్టీ పరిస్థితి మరింతగా దెబ్బతింటుందనే ఆందోళనలో ఉన్న బీఆర్ఎస్ ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టింది.
"""/" /
ఈ మేరకు ఎంపీ నామ నాగేశ్వరరావు ( Nama Nageswara Rao )తుమ్మలతో హైదరాబాదులో భేటీ అయ్యారు.
తొందరపడవద్దని , పార్టీ మారే ఆలోచనను విరమించుకోవాలని కోరారు .ఈ సందర్భంగా కేసీఆర్ సందేశాన్ని తుమ్మలకు వినిపించారు.
అయితే తుమ్మల ఖమ్మంలో తన అనుచరులతో సమావేశం అయ్యేందుకు నిర్ణయించారు .ఈ మేరకు రేపు ఖమ్మం జిల్లాకు తుమ్మల రాబోతున్నారు.
ఈ సందర్భంగా వేయి కార్లతో భారీగా ర్యాలీ నిర్వహించేందుకు తుమ్మల అనుచరులు ప్లాన్ చేసుకుంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో తుమ్మల పాలేరు నుంచి పోటీచేయాలని అనుచరులు తీర్మానం చేశారు.ఇక తుమ్మల సైతం కాంగ్రెస్ లో చేరేందుకే ఎక్కువ ఆసక్తితో ఉన్నట్లుగా ఆయన ప్రధాన అనుచరులే చెబుతుండడంతో కాంగ్రెస్ లో తుమ్మల నాగేశ్వరరావు చేరిక ఖాయంగా మారింది.
నదిలో పడిపోయిన యజమాని.. నది ఒడ్డునే 4-రోజులు వెయిట్ చేసిన కుక్క.. ఎక్కడంటే..?