ఈ మొక్క ఉన్నచోట పాములు విషపు కీటకాలు కనిపించవు.. ఎందుకో తెలుసా..?
TeluguStop.com
ముఖ్యంగా చెప్పాలంటే వర్షాకాలంలో కొన్ని కొన్ని సార్లు ఇంట్లోకి పాములు, తేళ్లు వస్తూ ఉంటాయి.
అవి ఎలుకల కోసం లేదా ఇంట్లో మొక్కలు గుబుర్ల మాదిరిగా ఉంటే వస్తుంటాయి.
కొన్ని మొక్కలు ఉన్నా చోట్ల పాములు అస్సలు కనిపించవని కొంత మంది నిపుణులు చెబుతున్నారు.
ఇలాంటి వాటిలో స్నేక్ ట్రీ( Snake Tree ) కూడా ఒకటని కచ్చితంగా చెప్పవచ్చు.
దీనిలో నుంచి ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది.స్నేక్ వీడ్ ట్రీ( Snake Weed Tree ) లో విషానికి విరుగుడుగా పనిచేసే కారకాలు ఉంటాయి.
"""/" /
వీటిలో నుంచి రసం తీసి పాము లేదా తేలు కుట్టిన చోట పెడితే కాస్తంత ఉపశమనం ఉంటుంది.
ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్లి దానికి తగినంత చికిత్స చేయించుకుంటే సరిపోతుంది.
ఈ చెట్లు చాలా అడుదుగా కనిపిస్తుంటాయి.అదే విధంగా దీని గురించి చాలామందికి అస్సలు తెలియదు.
ఈ చెట్లను సులభంగా గుర్తు పట్టవచ్చు.వీటి ఆకుల మీద పాము పడగా మాదిరిగా గుర్తు ఉంటుంది.
అంతేకాకుండా ఇవి పాకుతూ పెరుగుతాయి.ఆకులలో కూడా వేర్ల మాదిరిగా ఉంటాయి.
అందుకే వీటిని ఈజీగా భూమిలో నాటవచ్చు.అయితే ఈ మొక్కలపై ఎక్కువగా సూర్యకిరణాలు పడకుండా చూసుకోవడం ఎంతో మంచిది.
దీని పై నీడ ఉంటే తొందరగా పెరుగుతుంది.వీటిని నుంచి వెలువడే వాసనల వలన కొంత దూరం వరకు కూడా అసలు పాములు కనిపించవు.
అందుకే వీటిని కొందరు కావాలనే ఇంటి పరిసర ప్రాంతాలలో పెంచుకుంటూ ఉంటారు. """/" /
మనలో చాలామంది కొన్ని రకాల చెట్లను పెంచుకుంటారు.
వీటిలో ఈ స్నేక్ వీడ్ ట్రీని కూడా పెంచుకుంటే పాములు ఇతర విషపు కిటకాల భయం ఏమాత్రం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
ఈ చెట్టుకు పచ్చని ఆకులు, పింక్ ఎల్లో రంగులలో పూలు పూస్తుంటాయి.అందువల్ల వీటిని గుర్తించడం ఎంతో సులభం.
ప్రశాంత్ నీల్, ప్రశాంత్ వర్మ రెమ్యునరేషన్లు ఎంతో మీకు తెలుసా.. భారీగానే తీసుకుంటున్నారుగా!