ఆ గ్రామంలో పాము కరిచిన ఏమీ కాదు.. కానీ గ్రామ పొలిమేర దాటితే మరణమే.. మిస్టరీగా నాగేన హళ్లి..!

సాధారణంగా పాము అంటేనే ఎవరికైనా భయం వేస్తుంది.అలాంటిది పామును చూడగానే భయంతో ఆమడ దూరం పారిపోతాము.

ఒక్కసారిగా పాముకాటుకు గురైతే ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తారు.కానీ ఈ గ్రామంలోని ప్రజలు ఏకంగా పాములతో కలిసి జీవనం చేస్తుంటారు.

అంతేకాదు ఆ గ్రామంలో పాము కరిచిన ఎవరికీ ఏమీ కాదు.ఆ గ్రామంలో ప్రతి ఇంటిలో పాములు ఉంటాయి.

ఎంతో మిస్టరీగా ఉన్న ఆ ఊరు రహస్యాన్ని చేదించడానికి ఎంతోమంది ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు.

నాగేన హళ్లి అంటే తాచుపాముల గ్రామం అని అర్ధం ఈ గ్రామంలో ఎవరైనా పాముకాటుకు గురైతే వారిపై పాము విష ప్రభావం ఉండదు.

కానీ ఆ విషప్రభావం పాము కాటుకు గురైన వ్యక్తి కేవలం వారి గ్రామంలో ఉన్నంత వరకు మాత్రమే పని చేయదు.

ఒకవేళ ఎటువంటి పరిస్థితులలోనైనా ఊరి పొలిమేర దాటితే వారికి మరణం తప్పదని చెబుతున్నారు.

ఒక వ్యక్తి పాముకాటుకు గురైతే ఆ గ్రామంలో ఉన్నంతవరకు పాము విషం ఎందుకు పనిచేయడం అనే విషయం గురించి ఎంతో మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు.

అయితే ఆ రహస్యాన్ని ఇప్పటికీ ఎవరు కనుగొనలేకపోయారు. """/" / ఆ గ్రామంలో పాములు ఎంతో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి.

అక్కడ నివసించే ప్రజలకు ఆ పాముల వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు.ఒకవేళ ఎవరైనా పాముకాటుకు గురైతే వారు ఆ పామును తీసుకుని ఊరి బయట స్మశానంలో యతీశ్వర మండపం వద్ద ఉంచుతారు.

అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్న హనుమాన్ ఆలయంలో స్వామివారి తీర్ధం తీసుకొని మర్నాడు ఉదయం వరకూ ఆ గుడిలో నిద్ర పోకుండా రాత్రంతా మేల్కొని ఉండటం వల్ల ఆ విష ప్రభావం వారిపై పనిచేయదు.

యతీశ్వరుడు అనే సాధువు శాపం కారణంగా పాము కాటుకు గురైన వ్యక్తికి గ్రామం దాటితే మరణం తప్పదని చెప్పటం వల్ల ఆ ఊరి ప్రజలు ఎవరూ కూడా గ్రామ సరిహద్దులు దాటారని అక్కడి ప్రజలు చెబుతున్నారు.

యతీశ్వరుడు అనే సాధువు భిక్షాటన చేస్తున్న సమయంలో ముళ్లపొదల్లో ఉన్న బిడ్డను చూసి పెంచి పెద్ద చేస్తాడు.

ఆ బాలుడు పెరిగి పెద్దయిన తర్వాత ఒకరోజు బిక్షాటన నిమిత్తం వెళ్లిన సాధువు తిరిగి వచ్చే సమయానికి తన పుత్రుడు పాముకాటుకు గురై మరణించిన ఉంటాడు.

తన కొడుకు మరణం పట్ల ఆగ్రహించిన ఆ సాధువు ఆవేశంతో పాములకు శాపం పెడుతున్న సంగతి తెలుసుకున్న నాగరాజు అతని దగ్గరకు వెళ్లి శరణు కోరుతుంది.

తనకు పెట్టే శాపం నుంచి విముక్తి కలిగించమని చెప్పడంతో ఆ సాధువు ఈ గ్రామంలోని ప్రజలు ఎవరూ కూడా పాముకాటు వల్ల మరణించ కూడదు అని చెప్పడం వల్ల అందుకు నాగరాజు ఒప్పుకోవడమే కాకుండా తన పుత్రుడు ప్రాణాలు తిరిగి ఇవ్వటం వల్ల ఇప్పటికీ ఆ గ్రామంలో ప్రజలు ఎవరూ కూడా పాముకాటు వల్ల మరణించరని చెబుతారు.

అమ్మా బాబోయ్.. రేజీనా…సాయి ధరమ్ తేజ్..రెండు నిముషాల మ్యాగి కాదు అన్నమాట