షాకింగ్ వీడియో: అసలు ఆ పాముకు ఏం చెప్పవయ్యా బాబు.. అలా దొరికేసింది..

మనలో పాములంటే చాలామందికి భయం.పాము కొద్ది దూరంలో ఉంది అంటే చాలు.

అటువైపు కూడా కన్నెత్తి చూడకుండా దూరంగా వెళ్ళిపోతాము.మరికొందరైతే పాములను పెంపుడు జంతువుల లాగా ఇంట్లోనే ఉంచి వాటితో ఆడుకుంటూ.

, వాటితో పాటు పడుకోవడం లాంటి సంఘటనలకు సంబంధించి వీడియోలు చాలానే చూసాము.

ఇకపోతే కొందరు పాములను పట్టుకోవడంలో దిట్ట.కేవలం మగవారు మాత్రమే కాకుండా.

ఆడవారు కూడా ఈ పాములు పట్టడంలో ఆరితేరిపోయారు కొందరు.అయితే అక్కడక్కడ ఇళ్లలోకి గాని, ఏదైనా వ్యాపార సంస్థల్లోకి కానీ పాములు చొరబడినప్పుడు అలాంటి స్నేక్ క్యాచర్లను పిలిపించి వాటిని పట్టుకొని సుదూర ప్రాంతాలలో వదిలిపెట్టిన సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే చూసాము.

తాజాగా ఓ స్నేక్ క్యాచర్( Snake Catcher ) విషపూరితమైన కింగ్ కోబ్రాను ఏదో హిప్నోటిజం చేసినట్లుగా చేసి చివరికి పట్టుకున్నాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఈ వైరల్ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

"""/" / వీడియోలో కనిపిస్తున్న మనిషిని చూస్తే ఆ ఘటన ఆఫ్రికా( Africa ) దేశాలలో జరిగినట్లుగా అర్థమవుతుంది.

వీడియోలో అతనితోపాటు నల్లగా, పసుపు పచ్చని చారలతో ఉన్న నాగుపాము కనబడుతుంది.అది కూడా బుసలు కొడుతూ ఎవరైనా దొరుకుతె కాటు వేయడానికి రెడీగా ఉన్నట్లుగా కనబడుతుంది.

అయితే ఆ స్నేక్ క్యాచర్ మాత్రం ఆ పాముతో ఏదో మాట్లాడుతున్నట్టుగా ఆ పాము దగ్గరికి చేరుకున్నాడు.

అతడు చిన్నగా పాముతో ఏదో మాట్లాడుతున్నట్లుగా.నోట్లో నుంచి కొద్దికొద్దిగా పొగను వదులుతూ పాము తల దగ్గరికి తన కుడి చేతితో పాము తలను నిమురుతూ ఉండడం కనిపిస్తుంది.

అలా ఆ పాము అతడి ఆధీనంలో వచ్చినట్లుగా గ్రహించిన అతడు వెంటనే ఆ చేత్తోనే పాము తలని ఒక్కసారిగా అధమి పట్టుకున్నాడు.

దీంతో ఆ పాము ఒక్కసారిగా గిలగలలాడడం మొదలు పెడుతుంది. """/" / దీంతో వీడియో ముగుస్తుంది.

ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్స్.అసలు పాముతో ఏం చెప్పావ్ భయ్యా.

అలా నీ మాట వినిందని కొందరు అంటుంటే.నీకు ఏమైనా జంతువులకు సంబంధించి హిప్నాటిజం చేసే అలవాటు ఏమైనా ఉందా అంటూ మరికొందరు ప్రశ్నలు వేస్తున్నారు.

వైరల్ వీడియో: పార్కింగ్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా..? ఇకపై అంతే సంగతి..