ప్రైవేట్ పార్ట్‌పై పాము కాటు.. ఇన్‌ఫ్లుయెన్సర్ నరకయాతన.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!

పాముల(Snake) పేరు వింటేనే చాలామందికి ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి.ఇక వాటిని చూస్తే కొంత మంది కెవ్వున కేక పెట్టి కళ్లు తిరిగి కిందపడిపోతారు.

అయితే కొంతమందికి మాత్రం పాములంటే విపరీతమైన ఆసక్తి ఉంటుంది.అయితే అవి ఎవరిపైనైనా దాడి చేస్తాయని గుర్తుపెట్టుకోవాలి.

ఈ విషయం ఇండోనేషియన్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు కొద్దిగా ఆలస్యంగా బోధపడింది.నీ యువకుడు వాటితో విన్యాసాలు చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తుంటాడు.

అతని సోషల్ మీడియా ఖాతా మొత్తం పాములతో చేసిన విన్యాసాలతో నిండిపోయింది.అయితే, తాజాగా అతను చేసిన ఒక వీడియో మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లను షాక్‌కు గురిచేసింది.

ఆ వీడియోలో, ఆ ఇన్‌ఫ్లుయెన్సర్‌(Influencer) ఒక పామును తోకతో పట్టుకుని ఉండగా, అది ఒక్కసారిగా అతని ప్రైవేట్ పార్ట్‌ను(Private Part) కొరికి గట్టిగా పట్టుకుంది.

ఆ దృశ్యాన్ని చూస్తే ఎవరికైనా వణుకు పుట్టేలా ఉంది.అతను విపరీతమైన బాధతో చెమటలు కక్కుతూ, విలవిల్లాడుతూ కనిపించాడు.

మొదట పామును వదిలించుకోవడానికి నిలబడి ప్రయత్నించాడు, కానీ అది గట్టిగా పట్టుకుంది.వీడియో చివర్లో, అతను నేలపై కూర్చుని తీవ్రంగా ఇబ్బంది పడుతూ కనిపించాడు.

"""/" / ఇది కావాలని చేసిన స్టంటా, లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనేది ఇంకా తెలియలేదు.

కానీ, సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు."అది మడ అడవిలో ఉండే పాములా ఉంది.

అవి కొంచెం విషపూరితమైనవి, వెనుకవైపు కోరలు కలిగి ఉంటాయి.అతనుకు దాని గురించి తెలిసే ఉంటుంది" అని ఒకరు కామెంట్ చేశారు.

చాలామంది ఆ పామును మడ అడవి పాముగా గుర్తించారు.బ్రిటానికా ప్రకారం, ఈ పాములు దక్షిణ ఆసియా నుంచి ఆస్ట్రేలియా వరకు కనిపిస్తాయి.

వాటి కనుపాపలు గుండ్రంగా కాకుండా, పిల్లి కళ్లలా ఉండటం వల్ల వాటిని "పిల్లి కళ్ల పాములు" అని కూడా అంటారు.

ఇంకొక నెటిజన్ సరదాగా "నాకే సమస్యలు ఉన్నాయని అనుకున్నాను" అని కామెంట్ చేస్తే, మరొకరు "ఇది చూస్తుంటేనే నాకు నొప్పిగా ఉంది" అని అన్నారు.

"ఇది మంచి ఆలోచన కాదు, కానీ నేను అర్ధం చేసుకోగలను" అని ఇంకొకరు కామెంట్ చేశారు.

ఈ విన్యాసాలు చేసే ఇన్‌ఫ్లుయెన్సర్ పేరు అంగారా షోజి.ఇతను జంతువులతో చేసే సాహస విన్యాసాలకు చాలా ఫేమస్.

ఇతనికి ఇన్‌స్టాగ్రామ్‌లో 900 పోస్టులు, 3.5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

యూట్యూబ్‌లో 4.6 లక్షకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

పది రూపాయల మ్యాంగో జ్యూస్ ప్యాకెట్ కోసం లక్ష రూపాల ఫోనునే ఎత్తుకెళ్లిన కోతి.. చివరకు?