సినిమా స్టైల్‌లో బంగారం స్మగ్లింగ్.. అయినా పట్టేశారు!
TeluguStop.com
విదేశాల నుంచి బంగారం( Gold ) పెద్ద ఎత్తున దేశంలోకి స్మగ్లింగ్ అవుతోంది.
నిత్యం విమానాశ్రయాలలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టి నిందితులను పట్టుకుంటున్నారు.అయినప్పటికీ స్మగ్లర్లు ( Smugglers ) ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదు.
వెరైటీ పద్ధతుల్లో బంగారం, ఇతర విలువైన వస్తువులు స్మగ్లింగ్ చేస్తున్నారు.సినిమా స్టైల్‌లో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తుండడంతో కస్టమ్స్ అధికారులు అవాక్కవుతున్నారు.
షూ కింది భాగంలో, లో దుస్తులలో, బెల్టులలో, బ్యాగ్ అడుగు భాగంలో, ట్రాలీ బాగ్ హ్యాండిల్ మధ్యలో ఇలా వివిధ రకాల్లో స్మగ్లింగ్‌కు కొందరు పాల్పడుతున్నారు.
అయితే నిందితులు ఎన్ని ప్లాన్స్ వేసినా అందుకు తగ్గ పై ఎత్తులు అధికారులు వేస్తున్నారు.
స్మగ్లర్ల ప్లాన్లు బెడిసి కొట్టేలా అధికారులు విస్తృత స్థాయిలో తనిఖీలు చేపడుతున్నారు.తాజాగా తమిళనాడులోని తిరుచ్చి ఎయిర్ పోర్టులో( Trichy Airport ) స్మగ్లర్ల నుంచి భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
"""/" /
తమిళనాడులో( Tamil Nadu ) జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో తిరుచ్చి విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు( Customs Officials ) ఇద్దరు ప్రయాణికుల నుంచి కోటి రూపాయల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
శనివారం జరిగిన మొదటి సంఘటనలో, కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ తిరుచ్చి విమానాశ్రయంలో ఒక మగ ప్రయాణికుడిని అడ్డగించారు.
అనంతరం అతడిని పరిశీలించగా భారీగా బంగారం దొరికింది.700 గ్రాముల ఏడు బంగారు బిస్కెట్లు, 94 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
"""/" /
సింగపూర్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో( Air India Express ) ప్రయాణికుడు తిరుచ్చి విమానాశ్రయానికి వచ్చినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
అతడి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.47 75,400లు ఉంటుంది.
శనివారం జరిగిన మరో ఘటనలో, విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మరో ప్రయాణికుల నుంచి సుమారు 995.
500 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.అతని నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.
60,42,685.ఇలా ఒకే రోజు కోటి రూపాయల విలువైన బంగారం దొరికింది.
దీంతో దేశంలోకి ఏ స్థాయిలో బంగారం స్మగ్లింగ్ అవుతుందో అర్ధం చేసుకోవచ్చు.