భారత్ తరపున అరుదైన రికార్డ్ సాధించిన మహిళా క్రికెటర్ స్మృతి మందన..

భారత మహిళల క్రికెట్ జట్టు లో స్మృతి మందన అంటే తెలియని క్రికెట్ అభిమానులంటూ ఎవరు ఉండరు.

భారత మహిళల క్రికెట్ జట్టు లో ఆడుతూ ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించింది.

తాజాగా భారత మహిళా క్రికెటర్, స్టైలిష్ బ్యాటర్ స్మృతి మందన అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.

భారత్ తరపున మహిళా క్రికెటర్ స్మృతి మందన 100 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన రెండో మహిళా బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది.

ఆసియాకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌లోని సిల్‌హెట్‌లో థాయ్‌లాండ్ జట్టుతో జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా స్మృతి మందన ఈ ఫీట్ సాధించింది.

స్మతి మందన కంటే ముందు స్కిప్పర్ హర్మన్ ప్రీత్ కౌర్ 100 టీ20 మ్యాచ్‌ల మైలురాయిని అందుకుంది.

మొత్తం 135 మ్యాచ్‌లు ఆడిన హర్మన్‌ప్రీత్ కౌర్‌, 27.28 సగటుతో 2,647 పరుగులు చేసింది.

అందులో ఒక సెంచరీ, 8 అర్ధ సెంచరీలు ఉన్నాయి.అటు బౌలింగ్‌లోనూ రాణించి 32 వికెట్లను తన ఖాతాలో వేసుకుంది.

ఇక ఇవాళ వందో టీ20 మ్యాచ్ ఆడిన స్మృతి మందన మొత్తం 26.

96 సగటుతో 2,373 పరుగులు చేసింది.అందులో 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

స్మృతి మందన బెస్ట్ స్కోర్ 86 పరుగులు.ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఇంటర్నేషనల్‌ టీ20లు ఆడిన రికార్డు న్యూజీలాండ్ మహిళా బ్యాటర్ సుజీ బేట్స్ పేరిట ఉంది.

ఆమె మొత్తం 136 మ్యాచ్‌లు ఆడింది. """/"/ ఆ తర్వాత స్థానాల్లో హర్మన్ ప్రీత్ 135 టి20 అంతర్జాతీయ మ్యాచులు, ఇంగ్లండ్‌కు చెందిన డానియెల్లీ వ్యాట్ 135 టి20 అంతర్జాతీయ మ్యాచ్లు, ఆస్ట్రేలియాకు చెందిన అలిస్సా హీలీ 132, వెస్టిండీస్‌కు చెందిన డీండ్రా డాట్టిన్ 127 మ్యాచ్లు ఆడి ఉన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళా క్రికెటర్లలో ఎక్కువ అంతర్జాతీయ టి20 మ్యాచ్ లు ఆడిన వారిలో స్మృతి మందన ఐదో స్థానంలో ఉంది.

ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఆసియా కప్ టోర్నీలో టీమిండియా మహిళల జట్టు అద్భుతంగా ఆడుతుంది.

అనారోగ్యానికి గురైన సాయి పల్లవి… విశ్రాంతి తప్పనిసరి అంటున్న వైద్యులు!