భార్య సిగరెట్ తాగొద్దని చెప్పినందుకు భర్త ఏకంగా….
TeluguStop.com
ప్రస్తుత కాలంలో కొందరు మద్యపానం, ధూమపానానికి బానిసలై క్షణికావేశం కోల్పోయి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటూ తమ అనుకున్న వారి జీవితాల్లో విషాదాలు నింపుతున్నారు.
తాజాగా ఓ వ్యక్తికి కట్టుకున్న భార్య సిగరెట్ తాగొద్దని చెప్పడంతో ఆ భర్త ఏకంగా యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశంలోని చెన్నై రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే నరసింహన్ అనే 72 సంవత్సరాల కలిగినటువంటి వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి చెన్నై పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి సాలిగ్రామం ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.
అయితే అతడికి నిత్యం సిగరెట్ తాగే అలవాటు ఉండేది.అయితే ఈ కారణంగా ఇటీవలే కొన్ని ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తడంతో అతడి భార్య సిగరెట్లు తాగడం మానేయాలంటు నరసింహన్ పై ఒత్తిడి తెచ్చింది.
అయినప్పటికీ చాలా ఏళ్ల నుంచి కొనసాగిస్తున్నటువంటి అలవాటు కావడంతో నరసింహన్ సిగరెట్ తాగడం మానని చెప్పడంతో ఈ విషయంలో తరచూ ఇద్దరూ గొడవ పడుతూ ఉండేవాడు.
అయితే తాజాగా ఈ సిగరెట్ తాగే విషయంలో మరోమారు గొడవ జరగడంతో క్షణికావేశంలో నరసింహన్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు.
ఇందులో భాగంగానే యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.ఇది గమనించినటువంటి నరసింహన్ భార్య పోలీసులు మరియు ఆసుపత్రి అధికారులకు సమాచారం అందించింది.
సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆస్పత్రికి తరలించారు.
ఆయన నాకు ఎప్పటికీ ప్రత్యేకమే…. ఆ హీరో పై నటి త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు?