కోరమాండల్ ఎక్స్‎ప్రెస్ ట్రైన్‎లో పొగలు.. భయాందోళనలో ప్రయాణికులు

కోరమాండల్ ఎక్స్‎ప్రెస్ ట్రైన్( Coromandel Express )‎లో ఒక్కసారిగా పొగలు చెలరేగాయి.దీంతో రైలులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ఏలూరు నుంచి విజయవాడ( Vijayawada ) వైపు వెళ్తుండగా కోరమాండల్ ఎక్స్‎ప్రెస్ ట్రైన్‎లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

వెంటనే గమనించిన అధికారులు రైలును అరగంట పాటు నిలిపివేశారు.సాంకేతిక సిబ్బంది వచ్చి ట్రైన్ ను పరిశీలించిన తరువాత రైలును విజయవాడకు పంపించారు.

అయితే ఎండ వేడిమి కారణంగా కోరమాండల్ ఎక్స్‎ప్రెస్ ట్రైన్‎లో పొగలు వచ్చాయని ప్రాథమికంగా నిర్ధారించారు.

పాపం పురంధరేశ్వరి .. అందుకే పదవి దక్కలేదా ?