తెలుగు ప్రముఖ సింగర్ పేస్ బుక్ హ్యాక్ చేసి నగ్న ఫోటోలను షేర్…
TeluguStop.com
ఈమధ్య కాలంలో కొందరు కేటుగాళ్లు సమాజంలో పేరు, ప్రతిష్టలు కలిగి ఉన్నటువంటి సెలబ్రిటీల సోషల్ మీడియా మాధ్యమాలను హ్యాక్ చేసి వాటి ద్వారా అశ్లీల పోస్టులు షేర్ చేస్తూ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారు.
తాజాగా ప్రముఖ పాప్ సింగర్ స్మిత ఫేస్ బుక్ పేజీని కొందరు దుండగులు హ్యాక్ చేసి అశ్లీల పోస్టర్లు మరియు నగ్న ఫోటోలను షేర్ చేశారు.
ఈ విషయంపై స్పందించిన సింగర్ స్మిత తన అధికారిక ఫేస్ బుక్ పేజీని ఎవరో కొంతమంది వ్యక్తులు హ్యాక్ చేశారని తన అధికారిక ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలిపింది.
అంతేకాక అశ్లీల ఫోటోలను మరియు అనుచిత కంటెంటును షేర్ చేశారని వాపోయింది.కానీ ఫేస్ బుక్ టీమ్ సభ్యులకు ఈ విషయం గురించి ఫిర్యాదు చేయగానే వెంటనే స్పందించి తన ఫేస్ బుక్ పేజీని తనకు తిరిగి తెచ్చి పెట్టినందుకు ధన్యవాదాలు తెలిపింది.
దీంతో ఈ విషయంపై స్పందించిన కొందరు నెటిజన్లు ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలకు సోషల్ మీడియా మాధ్యమాలలో రక్షణ లేకుండా పోతుందని కామెంట్లు చేస్తున్నారు.
అంతేగాక సెలబ్రిటీల ప్రైవసీ మరియు సెక్యూరిటీ విషయంలో సోషల్ మీడియా మాధ్యమాలు కొంతమేర ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే టాలీవుడ్ నటి మరియు సౌత్ ఇండియా నెంబర్ వన్ డ్యాన్స్ షో డీ జోడి జడ్జిగ వ్యవహరిస్తున్న నటి పూర్ణ కి కూడా సోషల్ మీడియా మాధ్యమాలలో చేదు అనుభవం ఎదురైంది.
కొందరు వ్యక్తులు ఏకంగా తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే దారుణంగా హత్య చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు.
దీంతో వెంటనే అప్రమత్తం అయినటువంటి పూర్ణ కుటుంబ సభ్యులు దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించగా సైబర్ క్రైమ్ పోలీసులు నిందితులను కనిపెట్టి అదుపులోకి తీసుకొని కటకటాల్లోకి నెట్టారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి31, సోమవారం 2025