అందరినీ ఆశ్చర్యపరుస్తున్న చనిపోయిన మాంక్ నవ్వు!

తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో తెగ వైరల్ అవుతుంది.ఆ ఫోటో వైరల్ అవడానికి గల కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

తాజాగా చైనాలోని మంగోలియా ప్రాంతంలో ఒక బుద్ధుడి మాంక్ మమ్మీ దొరికింది.ఈ శరీరం చూడడానికి హారర్ చిత్రాలలో చూపించిన దెయ్యం లాగా ఉంది.

ఇక ఈ మాంక్ మమ్మీగా మారి సుమారు 100 ఏళ్లు పూర్తి అవుతుందని ఆ శరీరాన్ని చూసిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇక గతంలో కూడా ఇలాంటి మాంక్ మమ్మీలు బయట పడటం జరిగింది కదా మరి ఇందులో వింతేముంది అని మీరు అనుకోవచ్చు అక్కడికే వస్తున్నానండి ఈ మాంక్ చనిపోయి సుమారు 100 ఏళ్లు పూర్తవుతున్న ఆ మొహం పై ఆ నవ్వు చెరిగిపోలేదు.

ఇదే ప్రస్తుతం శాస్త్రవేత్తలకు సవాలుగా మారింది.ఇక ఇదెలా సాధ్యమనే అంశంపై వాళ్ళు తలమునకలు అయి ఉన్నారు.

ఇక దీని పైన బౌద్ధ మతాన్ని పాటించే వారు ఈ మాంక్ ఇంకా బ్రతికే ఉన్నాడని కానీ ఆయన నిద్రాణమైవున్నారని చెబుతున్నారు.

మరి నవ్వుతున్న ఈ మాంక్ వెనక దాగి ఉన్న రహస్యం మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.