జేఈఈ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్ కలకలం..!

జేఈఈ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్ తీవ్ర కలకలం సృష్టించింది.గత ఆదివారం జరిగిన ఈ పరీక్షలో ఎలక్ట్రానిక్ డివైజెస్ ద్వారా నలుగురు విద్యార్థులు కాపీ చేసినట్లు అధికారులు గుర్తించారు.

కడప జిల్లాకు చెందిన విద్యార్థి ఈ వ్యవహరంలో కీలకంగా వ్యవహరించాడని తెలుస్తోంది.స్నేహితుల కోసం స్మార్ట్ కాపీయింగ్ చేశాడని అధికారులు తెలిపారు.

ఈ క్రమంలోనే జవాబు పేపర్ ను వాట్సాప్ ద్వారా ఫ్రెండ్స్ కు షేర్ చేశాడని సమాచారం.

సికింద్రాబాద్ లోని ఎస్వీఐ సెంటర్ లో కాపీయింగ్ పాల్పడ్డారని సమాచారం.కడప విద్యార్థి స్నేహితులను దిల్ సుఖ్ నగర్ లో అబ్జర్వర్ పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

ఈ వ్యవహరంపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రేణు దేశాయ్ కేవలం హీరోయిన్ మాత్రమే కాదు.. ఆమె ప్రతిభ గురించి తెలిస్తే..