స్మార్ట్ క్యాట్: మనుషులవలె ప్రవర్తిస్తున్న పిల్లి... ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వీడియో!
TeluguStop.com
సోషల్ మీడియా పరిధి పెరుగుతున్నవేళ ప్రపంచం నలుమూలలా జరుగుతున్న వింతలూ, విడ్డురాలు బయటకు వస్తున్నాయి.
ముఖ్యంగా జంతువులు, వణ్యప్రాణులకు సంబంధించిన కటెంట్ చూడటానికి నెటిజన్లు ఆసక్తిని కనబరుస్తున్నారు.ఈ క్రమంలో పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోల బాగా వైరల్ అవుతున్నాయి.
అవి చేసే కొన్ని చిలిపి పనులు.చిత్ర విచిత్రమైన చేష్టలు వలన విశేషంగా వ్యూస్ సంపాదిస్తున్నాయి.
ఈ తరహాకు చెందిన ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
అది చూసిన నెట్టిజన్లు చేత్తున్న కామెంట్లు సైతం ఆకట్టుకుంటున్నాయి.వివరాల్లోకి వెళితే.
ఇక్కడ మనకి వీడియోలో కనబడుతున్న పిల్లి మామ్మూలు పిల్లి కాదు.స్మార్ క్యాటండి బాబు.
అవును, నెటిజన్లు దానికి ఆ పేరు పెట్టారు మరి.ఎందుకంటే అది ఒక వాటర్ కూలర్ నుండి పిల్లి నీళ్లు తాగుతోంది.
బుధవారం ట్విటర్‌లో బ్యూటెంగెబిడెన్ షేర్ చేసిన ఈ వీడియో.మిలియన్ల కొద్ది వ్యూస్.
లక్షల్లో లైక్స్ సంపాదిస్తోంది.ఈ వీడియోకు "స్టే హైడ్రేటెడ్" అని క్యాప్షన్ ఇచ్చాడు.
ఈ వీడియోలో ఒక పిల్లి నీళ్ల కోసం వాటర్ కూలర్ పక్కన నిలబడి ఉంది.
ఈ తర్వాత నీటిని తాగడానికి ప్రయత్నిస్తూ.ట్యాబ్‌ను నొక్కి వాటర్ కిందకు వస్తుంటే దాని దాహాన్ని తీర్చుకుంటుంది.
దీనిని పోస్టు చేసినప్పటి నుండి ట్విట్టర్‌లో ఇప్పటివరకు 9.9 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
అలాగే, 4.6 లక్షలకు పైగా లైక్‌లను సంపాదించింది.
అలాగే ఈ వీడియోకు కామెంట్లు సైతం వర్షంలాగా కురుస్తున్నాయి."జంతువులు చాలా తెలివైనవి" అని ఒకరు కామెంట్ చేస్తే, "పిల్లలు ఛాంపియన్లు" అని మరొకరు, "ఈ కిట్టికి కొంచెం స్టూల్ ఇవ్వండి" అని వేరొకరు "మీ స్నేహితులను హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడండి" అని మరో యూజర్ కామెంట్ చేశాడు.
ఇతర పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు సైతం ఇక్కడ షేర్ చేస్తున్నారు.