ఈసారి ఓటీటీకి చిన్న పెద్ద ఎవరు ఇంట్రెస్ట్‌గా లేరేంటో?

కరోనా కారణంగా గత సంవత్సరం దాదాపుగా పది నెలల పాటు థియేటర్లు లాక్‌ అయ్యాయి.

మెల్లగా ఓపెన్‌ చేసి పెద్ద సినిమా లను తీసుకు వస్తున్న సమయంలో మళ్లీ కరోనా సెకండ్‌ వేవ్‌ రూపంలో వచ్చి ఇబ్బందులు పెడుతోంది.

గత నెల రోజులుగా మళ్లీ థియేటర్లు పూర్తిగా మూత పడ్డాయి.మళ్లీ ఎప్పటికి ఓపెన్‌ అయ్యేది తెలియడం లేదు.

గత ఏడాది థియేటర్లు మూత పడ్డ సమయంలో పదుల సంఖ్యలో పెద్ద చిన్న సినిమాలు థియేటర్లలో కాకుండా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

కాని ఈసారి మాత్రం పెద్దగా ఓటీటీ లో సినిమా లు విడుదలకు సిద్దంగా లేవు.

పెద్ద సినిమాలు మరియు చిన్న సినిమాలు ఇలా ఏ సినిమాలు కూడా ఓటీటీ విడుదలకు సిద్దంగా లేవు అంటున్నారు.

ఓటీటీ కోసం తెరకెక్కించిన సినిమాలు మాత్రమే ఇటీవల ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఓటీటీ సినిమాలకు ప్రేక్షకుల నుండి ఆధరణ దక్కక పోవడంతో పాటు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు.

ఓటీటీలు అన్ని కలిసి తక్కువ రేటుకు సినిమాలను కోట్‌ చేస్తున్నాయి.దాంతో సినిమా ను విడుదల చేయడం లో కాస్త వెనుక ముందు ఆడుతున్నారు.

అందుకే ఇటీవల కాలంలో థియేటర్లు ఓపెన్ లేకున్నా కూడా ఓటీటీ ద్వారా సినిమా లు మాత్రం రావడం లేదు.

ఓటీటీ లో విడుదల అవుతున్న సినిమాలు చిన్న బడ్జెట్‌ అవ్వడం వల్ల జనాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

ముందు ముందు కూడా ఓటీటీ లు పెద్ద ఎత్తున సినిమా లను విడుదల చేస్తాయని భావించినా కూడా నిర్మాతలు థియేటర్ల ఓపెన్‌ కోసం ఎదురు చూస్తున్నారు.

సెకండ్‌ వేవ్‌ జూన్‌ మొదటి లేదా రెండవ వారంకు ముగుస్తుందని జూన్‌ మద్య నుండి అన్ని కార్యక్రమాలు సజావుగా సాగుతాయని అంటున్నారు.

అందుకే థియేటర్ల పై నమ్మకంతో సినిమా లను ఓటీటీ లో విడుదల చేయకుండా వాయిదా వేస్తున్నారు.

లోక్‎సభ ఎన్నికల ప్రచారానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్..!!