అసెంబ్లీలో గవర్నర్ గోబ్యాక్ అంటూ నినాదాలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.నేటి నుండి ప్రారంభమైన ఈ బడ్జెట్ సమావేశాలలో తొలుత గవర్నర్ ప్రసంగించడం జరిగింది.

ఈ క్రమంలో టీడీపీ సభ్యులు అసెంబ్లీ ప్రాంగణంలో తీవ్ర గందరగోళం సృష్టిస్తూ గవర్నర్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు.రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ అంటూ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ టిడిపి సభ్యులు ఆందోళనలు చేశారు.

ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి పథంలో పయనిస్తుందని ప్రసంగిస్తున్నారు.

ఉగాది నుండి కొత్త జిల్లాలో పాలన సాగుతోందని తెలిపారు.వికేంద్రీకరణ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని గవర్నర్ బిశ్వభూషణ్ ప్రసంగించిన సమయంలో.

ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.గవర్నర్ ప్రసంగం ప్రతులను చించి వేస్తూ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

దీంతో నిరసనల మధ్యనే గవర్నర్ బిశ్వభూషణ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.టిడిపి సభ్యుల నిరసనలపై సీఎం జగన్ అసహనం వ్యక్తం చేశారు.

ఫస్ట్ టైం గవర్నర్ హరిచందన్ అసెంబ్లీ ప్రాంగణానికి రావడంతో సీఎం జగన్ అదేవిధంగా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరికొంత మంది మంత్రులు స్వాగతం పలికారు.

ఏపీలోని ఆ ముగ్గురు నేతలపై భారీగా బెట్టింగ్స్.. ఒక్కరు కూడా గెలవడం కష్టమేనా?