అటు వైపు తిరిగి పడుకుంటే సగం ఆరోగ్య సమస్యలు పోతాయా..?!

అటు వైపు తిరిగి పడుకుంటే సగం ఆరోగ్య సమస్యలు పోతాయా?!

సాధారణంగా ప్రతి ఒక్కరు రాత్రి నిద్రించే సమయంలో రకరకాల భంగిమల్లో నిద్రిస్తూ ఉంటారు.

అటు వైపు తిరిగి పడుకుంటే సగం ఆరోగ్య సమస్యలు పోతాయా?!

కొందరు కుడి పక్కకు తిరిగి పడుకుంటే మరి కొందరు మాత్రం ఎడమ పక్కకు తిరిగి పడుకుంటారు.

అటు వైపు తిరిగి పడుకుంటే సగం ఆరోగ్య సమస్యలు పోతాయా?!

అలాగే కొంత మందికి బొక్కబోర్లా పడుకునే అలవాటు కూడా ఉంటుంది.మరి కొందరు వెల్లకిలా పడుకుంటారు.

ఒకే పొజిషన్ లో రాత్రంతా పడుకోవాలంటే కొంచెం కష్టతరమైన పనే కదా.అయితే అసలు పడుకునేటప్పుడు ఏ వైపు తిరిగి పడుకుంటే ఆరోగ్యానికి మంచిదో అనే విషయం మీలో చాలా మందికి తెలిసి ఉండక పోవచ్చు.

అందుకే మనం నిద్రించే సమయంలో ఎటు వైపు తిరిగి పడుకుంటే మంచిదో అనే విషయాలు ఓసారి తెలుసు కుందాం.

మనం నిద్రపోతున్న సమయంలో మన శరీరానికి రక్త ప్రసరణ సరిగ్గా జరగడం అనేది చాలా ముఖ్యం.

అందుకే రాత్రి నిద్రించే సమయంలో ఎడమ వైపు తిరిగి పడుకుంటే శరీరంలోని అన్నీ అవయవాల పనితీరును బాగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

ఎవరికయితే గుండె మంట, అసిడిటీ వంటి సమస్యలు ఉంటాయో వాళ్ళు నిద్రకు ఉపక్రమించే సమయంలో ఎడమవైపుకు తిరిగి పడుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఎడమ వైపుకు తిరిగి పడుకున్నట్లయితే జీర్ణాశయంలోని పదార్థాలు, యాసిడ్ మళ్లీ వెనక్కి వచ్చే ఆస్కారం ఉండదు.

ఫలితంగా అసిడిటీ సమస్య రాదు.అలాగే మరో ముఖ్యమైన అవయవం కాలేయం శరీరానికి కుడి వైపున ఉంటుంది.

మనం పడుకునే అప్పుడు కుడివైపు తిరిగి పడుకుంటే లివర్ పై ఒత్తిడి పడుతుంది.

దాని ఫలితంగా శరీరంలోని టాక్సిన్స్ లివర్ ని ఎక్కువగా చేరేందుకు అవకాశం ఉంటుంది.

అందువల్ల ఎడమవైపునకు తిరిగి నిద్రిస్తే లివర్ పై భారం తగ్గుతుంది. """/" / అలాగే మన శరీరంలో ముఖ్యమైన అవయవం గుండె ఎడమ భాగంలో ఉంటుంది.

ఇది ఊపిరితిత్తుల నుంచి రక్తాన్ని మిగిలిన అన్నీ శరీర భాగాలకు పంపుతుంది.అందుకనే ఎడమవైపుకు తిరిగి నిద్రించడం వల్ల గుండె సామర్థ్యం పెరుగుతుంది.

అంతే కాకుండా ఎడమ వైపు తిరిగి నిద్రించడం వల్ల శరీరంలోని అన్నీ భాగాలకు రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది.

మన శరీరంలో శోషరస వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనది.శరీరంలోని హానికర పదార్ధాలను, విష పదార్థాలను తీసి వేస్తుంది.

అలాగే శోషరస వ్యవస్థలోని అతి పెద్ద నాళమైన థొరాసిక్ డక్ట్ మన శరీరంలో ఎడమ బాగానే ఉంటుంది.

అలాగే శోషరస వ్యవస్థలోని మరొక అతి పెద్ద అవయవం స్ప్లిన్ కూడా శరీరంలో ఎడమ వైపు భాగంలోనే ఉంటుంది.

అందుకే ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం వలన స్ప్లీన్ కి రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది.

గేమ్ ఛేంజర్ విషయంలో తన తప్పేం లేదంటున్న కార్తీక్ సుబ్బరాజ్.. అసలేం జరిగిందంటే?