వైరల్ వీడియో: పేదలపట్ల ఇలాంటి నీచమైన పని అవసరమా?

ఉత్తరప్రదేశ్‌లోని( Uttar Pradesh ) చార్‌బాఘ్ రైల్వే స్టేషన్‌లో( Charbagh Railway Station ) పేద ప్రజల పట్ల జరిగిన దారుణ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

రైల్వే స్టేషన్‌లో నిద్రపోతున్న పేద ప్రయాణికులపై స్టేషన్ సిబ్బంది చల్లనీళ్లు చల్లడంతో, ఈ చర్యపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చార్‌బాఘ్ రైల్వే స్టేషన్‌లో ఎముకలు కొరికే చలిలో తగిన ఆశ్రయం లేకుండా ప్లాట్‌ఫామ్‌పై విశ్రాంతి తీసుకుంటున్న పేదలపై రైల్వే సిబ్బంది( Railway Staff ) చల్లనీళ్లు చల్లారు.

ఈ ఘటనలో మహిళలు, చిన్నపిల్లలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.తల్లులు తన పిల్లలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుండగా, పిల్లలు ఏడుస్తూ కనిపించారు.

అయితే, ఇలాంటి పరిస్థితుల్లో కూడా సిబ్బంది ఏమాత్రం కనికరం చూపలేదు. """/" / ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్( Viral Video ) అవ్వగా, నెటిజన్లు దీనిపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.

మనుషులు మరీ ఇంత కర్కశంగా ఎలా తయారయ్యారు? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.సుభిక్ష పాలన అని చెప్పుకునే ప్రభుత్వం పేదల పట్ల ఇంత నిర్దయగా ప్రవర్తిస్తుందా? అంటూ కొందరు రాజకీయ నాయకుల మీద కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇక వీడియో చూసిన తర్వాత, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్( CM Yogi Adityanath ) ప్రభుత్వం తక్షణమే దీనిపై స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

చల్లని వాతావరణంలో ఈ విధమైన చర్యలు మనుష్యత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

"""/" / ఈ వీడియోలో చాలామంది నిరుపేద ప్రజలు రాత్రి సమయం కావడంతో రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం మీదనే ఒకవైపు పడుకోవడం కనపడుతుంది.

వీడియోలో చూసినట్లయితే చాలామంది మహిళలు, అలాగే చిన్న వయసు ఉన్న పిల్లలు కనబడతారు.

ఇలా వారు గాఢ నిద్రలో ఉన్న సమయంలో రైల్వే స్టేషన్ సిబ్బంది వారు ఇలా కర్కశంగా వ్యవహరించడంపై ప్రజలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.

మరోవైపు నుంచి ఆలోచిస్తే రైల్వే కార్మికులకు కూడా వారి పని ఎలాగైనా చేయాలని ఆలోచన కూడా ఉండొచ్చు కాబోలు.

ఏది ఏమైనా ఇలాంటి పనులు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ప్రజలు కోరుతున్నారు.

శంకర్ సినిమాలకు గుడ్ బై చెబితే బెటర్.. ఆ రేంజ్ లో ఎవరూ ఖర్చు చేయరంటూ?