నిద్ర‌తో కూడా క‌రోనాకు చెక్ పెట్ట‌వ‌చ్చు.. బ‌య‌ట‌ప‌డ్డ ఆస‌క్తిక‌ర విష‌యాలు!!

క‌రోనా వైర‌స్‌.ఎప్పుడు, ఎటు నుంచి వ‌చ్చి దాడి చేస్తుందో తెలియ‌క ప్ర‌జ‌లు గంద‌ర‌గోళంలో ప‌డిపోయారు.

గ‌త ఏడాది చైనాలోని వూహాన్ న‌గ‌రంలో వెలుగుచూసిన ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్‌.చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాల‌ను క‌మ్మేసింది.

ఈ వైర‌స్ ధాటికి ఇప్ప‌టికే ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోగా.ఇంకొన్ని ల‌క్ష‌ల మందికి పైగా ఈ వైర‌స్ సోకి నానా ఇబ్బందులు ప‌డుతున్నారు.

ఇక క‌రోనా ప్ర‌పంచంపై దాడి చేసి ఆరేడు నెల‌లు గ‌డుస్తున్నా.ఈ మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసే వ్యాక్సిన్ మాత్రం ఇంత‌వ‌ర‌కు అందుబాటులోకి రాలేదు.

అస‌లు ఎప్పుడు వ‌స్తుందో కూడా స‌రైన స్ప‌ష్ట‌త లేదు.ఈ నేప‌థ్యంలోనే క‌రోనా వైర‌స్ నుంచి ర‌క్షించుకోవాలంటే.

రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. """/" / అయితే రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచుకునేందుకు నిద్ర కూడా గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంద‌ని అంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు.

అదెలా అంటే.శరీరంలో వైరస్ బారిన పడిన కణాల్ని చంపేవి తెల్లరక్తకణాలు అన్న విష‌యం తెలిసిందే.

అయితే సరిగ్గా నిద్రపోకపోతే శ‌రీరంలో తెల్లరక్తకణాల ఉత్పత్తి తగ్గిపోతుందట.ఈ క‌ణాల ఉత్ప‌త్తి త‌గ్గే కొద్దీ వైరస్ బారిన ప‌డే రిస్క్ పెరుగుతుంద‌ని అంటున్నారు.

కాబ‌ట్టి, రోజుకు 8 గంటలు నిద్రపోవాలని వైద్యులు సూచిస్తున్నారు.త‌ద్వ‌రా రోగ‌నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డమే కాదు.

ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్‌కు కూడా చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని అంటున్నారు.ఇక కంటి నిండా నిద్ర‌తో పాటు పోష‌కాహారం తీసుకోవ‌డం.

క్ర‌మం త‌ప్ప‌కుండా వ్యాయామం చేయ‌డం వంటివి అస్స‌లు మ‌ర‌వ‌కూడ‌ద‌ని సూచిస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి28, మంగళవారం2024