హోలీ రంగుల నుంచి చ‌ర్మాన్ని కాపాడే సింపుల్ టిప్స్ మీకోసం!

హోలీ పండ‌గ అంటే ఎంత సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.చిన్న పిల్లల నుండి పండు ముసలివాళ్ల వరకూ రంగులు చల్లుకుంటూ ఎంతో ఆనందంగా హోలీ పండ‌గ‌ను జరుపుకుంటారు.

ఒక‌రిపై ఒక‌రు రంగుల‌ను వేసుకుంటూ, పూసుకుంటూ ఉంటే వ‌చ్చే ఉత్సాహం అంతా ఇంకా కాదు.

అయితే హోలీ పండ‌గ‌కు మార్కెట్‌లో దొరికే రంగుల‌ను వాడ‌టం వ‌ల్ల‌.వాటిలో ఉండే కెమిక‌ల్స్ చ‌ర్మానికి తీవ్రంగా హాని క‌లిగిస్తాయి.

ముఖ్యంగా రాషెస్‌, మొటిమ‌లు, మ‌చ్చ‌లు, అల‌ర్జీ ఇలా ఎన్నో చ‌ర్మ స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడ‌తాయి.

మ‌రియు జుట్టు కూడా డ్యామేజ్ అవుతుంది.అందుకే హోలీ రంగుల నుంచి చ‌ర్మాన్ని కాపాడుకోవాలంటే.

ఖ‌చ్చితంగా కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించాల్సి ఉంటుంది.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణంగా హోలీ ఆడిన త‌ర్వాత రంగుల‌ను స‌బ్బుతో క్లీన్ చేసుకుంటుంటారు.కానీ, స‌బ్బుతో రంగులు క్లీన్ చేసుకుంటే.

చ‌ర్మం డ్రైగా మారిపోతుంది.స‌బ్బు బ‌దులు శెన‌గ‌పిండి యూజ్ చేస్తే చ‌ర్మానికి మంచిది.

అలాగే కెమిక‌ల్స్ ఉండే క‌ల‌ర్స్‌ను వాడ‌టం వ‌ల్ల చ‌ర్మంపై రాషెస్ మ‌రియు మొటిమ‌లు ఏర్ప‌డ‌తాయి.

అయితే హోలీ అడే ముందు ఆడ‌, మ‌గ అనే తేడా లేకుండా అంద‌రూ చ‌ర్మానికి మాయిశ్చరైజర్ అప్లే చేసుకోవాలి.

మాయిశ్చరైజర్ వల్ల మీ ముఖంపై తేమ ఉంటుంది.మ‌రియు మీ స్కిన్ లోపలికి రంగులు వెళ్ల‌కుండా ఉంటాయి.

"""/" / రంగులు చ‌ల్లుకున్న త‌ర్వాత చాలా మంది హాట్ వాట‌ర్‌తో స్నానం చేస్తారు.

కానీ, ఇది చ‌ర్మానికి మంచిది కాదు.వీలైనంత వ‌ర‌కు చ‌ల్ల‌టి నీటితో స్నానం చేయ‌డ‌మే మంచిది.

ఇక హోలీ ఆడే స‌మ‌యంలో రంగులు క‌ళ్ల‌లో ప‌డ‌తాయి.అలా ప‌డ‌కుండా ఉండాలంటే సన్ గ్లాసెస్ పెట్టుకోండి.

అలాగే రంగులు పూసుకునే ముందు జుట్టుకు కొబ్బ‌రి పెట్టుకోవాలి.ఇలా చేస్తు జుట్టు డ్యామేజ్ కాకుండా ఉంటుంది.

వైశాలికి షేక్‌హ్యాండ్ ఇవ్వని ఉజ్బెక్ చెస్ ప్లేయర్.. ఇస్లాం కారణమంటూ కొత్త ట్విస్ట్..?